logo

ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి.

Published : 25 Apr 2024 10:57 IST

ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. అండర్-14, 16, 18, 20 విభాగంలో బాల బాలికలు, సీనియర్ విభాగంలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా మిడిల్,  లాంగ్ డిస్టెన్స్ అంశాల్లో పరుగు పోటీలను నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బెస్ట్ టైమింగ్స్ సాధించిన వారిని ఎంపిక చేస్తామని, వారు ఈనెల 28 నుంచి సూర్యాపేటలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని జిల్లా అథ్లెటిక్ సంఘం ప్రధాన కార్యదర్శి పి. రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ ప్రధాన కార్యదర్శి జ్యోతీశ్వరన్, వీజీఎస్ అకాడమీ ఛైర్మన్ రాకేష్, పీడీ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని