logo

ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది.

Published : 25 Apr 2024 06:30 IST

రాష్ట్రస్థాయిలో ప్రథమంలో 32 ద్వితీయంలో 30వ స్థానం

మంచిర్యాల విద్యావిభాగం, న్యూస్‌టుడే: ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. రాష్ట్ర స్థాయి స్థానాల్లో పరిశీలిస్తే రెండింటిలోనూ అట్టడుగు స్థానాల్లో మంచిర్యాల నిలిచింది. గతేడాదితో పరిశీలిస్తే రెట్టింపు స్థానాలు కిందికి దిగజారాయి. ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలదేే పై చేయి సాధించారు. గతేడాది ద్వితీయంలో 64శాతం ఉత్తీర్ణతతో 17వ స్థానంలో నిలవగా ఈసారి 59.53 శాతంతో 30వ స్థానంలో నిలిచింది. ప్రథమంలో గతేడాది  57 శాతంతో 18వ స్థానంలో ఉండగా ఈ సారి 46.29 శాతంతో అట్టడుగున(32వ స్థానం) చేరింది.

  • జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 28 నుంచి నుంచి గత మార్చి 19 వరకు ఇంటర్‌ జనరల్‌, వొకేషనల్‌ రాత పరీక్షలు జరిగాయి. అంతకుముందు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ప్రయోగ పరీక్షలు, 17, 19న మానవ నైతిక విలువలు, పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సంవత్సరం ద్వితీయ సంవత్సరం 6480 మంది పరీక్షలు రాయగా 3907 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 60.29గా నమోదైంది.
  • మొదటి ఏడాది విద్యార్థులు 6563 మంది పరీక్షలు రాయగా 3114 మందితో 47.44 ఉత్తీర్ణత శాతాన్ని సాధించారు.

గతేడాదితో పోలిస్తే ఈ సారి ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయి. 2022-23 సంవత్సరంతో పోలిస్తే ద్వితీయంలో 4.47 శాతం, ప్రథమంలో 10.71శాతం ఉత్తీర్ణత తగ్గింది. గత సంవత్సరాల్లో జిల్లాలో సాధించిన ఫలితాలు ఇలా ఉన్నాయి.

గడిచిన సంవత్సరంలో రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షల్లో ద్వితీయ సంవత్సరంలో ఆయా సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు సైతం మార్చిలో నిర్వహించిన పరీక్షలకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా జనరల్‌ విభాగంలో 701 మంది పరీక్ష రాయగా 193 మంది పాసయ్యారు. వొకేషనల్‌ విభాగంలో 61 మందికి 25 మంది ఉత్తీర్ణత సాధించారు.

అమ్మాయిలదే పై చేయి

ఎప్పటిలాగే ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. బాలుర కన్నా దీటుగా రాణించి మెరుగైన ఫలితాలు సాధించారు. జనరల్‌, వొకేషనల్‌ విభాగం రెండింటిలోనూ ప్రథమ సంవత్సరంలో బాలురు-35.37 శాతం బాలికలు-58.46 శాతం, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలురు-48.57శాతం కాగా బాలికలు-70.76శాతం ఉత్తీర్ణత పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు