logo

అమ్మాయిలదే హవా

ఇంటర్‌ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా  నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్‌ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్‌లో మాత్రం కొంత మెరుగైంది.

Published : 25 Apr 2024 06:19 IST

ఫిబ్రవరిలో నిర్వహించిన వార్షిక పరీక్ష రాసేందుకు వరుస క్రమంలో వెళ్తున్న విద్యార్థినులు

న్యూస్‌టుడే, నిర్మల్‌ అర్బన్‌: ఇంటర్‌ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా  నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్‌ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్‌లో మాత్రం కొంత మెరుగైంది. రెగ్యులర్‌ కోర్సులకు సంబంధించి 2022-23 లో ప్రథమ సంవత్సరంలో 8వ స్థానంలో ఉండగా ప్రస్తుతం విడుదల చేసిన ఫలితాల్లో 16వ  స్థానానికి పడిపోయింది. ద్వితీయ ఏడాదిలో గత సంవత్సరం 9వ స్థానంలో ఉండగా ఈ సారి 12కు తగ్గింది. ఒకేషనల్‌ కోర్సుల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం గత విద్యా సంవత్సరం 34, 30 స్థానాల్లో ఉండగా, ఈ సారి మాత్రం 27, 28 స్థానాల్లో నిలిచింది.  

వరుసగా..

2022-23, ఈ ఏడాది ప్రకటించిన ఫలితాల్లో వరుసగా రెండు పర్యాయాలు అమ్మాయిల హవానే కొనసాగింది. 2022-23లో ప్రథమ సంవత్సరంలో 73శాతం కైవసం చేసుకోగా ఈ సారి 68.68, ద్వితీయ ఏడాదిలో గత సంవత్సరం 78, తాజాగా 76.83 శాతంతో తమ విజయఢంకాను మోగించారు. ఒకేషనల్‌లోనూ గత సంవత్సరం ప్రథమంలో 58, ద్వితీయ సంవత్సరంలో 77, ప్రస్తుతం వెల్లడించిన ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 62.58, ద్వితీయ సంవత్సరంలో 75.66 శాతంతో తమదైన ప్రత్యేకతను కనబర్చారు.

అత్యుత్తమంగా..

జిల్లాలో 18 కేజీబీవీలుండగా 11 కళాశాలలుగా ఉన్నతీకరించారు. ఇందులో 2023-24 సంవత్సరంలో పెంబి(మందపల్లి)లో ఎంపీసీ, బైపీసీని ప్రారంభించారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ ఉత్తీర్ణులై శతశాతం కైవసం చేసుకున్నారు. నర్సాపూర్‌(జి) విద్యాలయంలోని ఎంపీసీ,బైపీసీ విభాగంలో ద్వితీయ సంవత్సరంలో 100 శాతం నమోదు చేసుకుంది. కడెం విద్యాలయంలోని సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు చదివే ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు శతశాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లావ్యాప్తంగా ఎంపీసీ, బైపీసీ కోర్సులను ఏడు, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూలను నాలుగు చోట్ల నిర్వహిస్తున్నారు. మొత్తంగా కేజీబీవీలు 89 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని