logo

ఆరో రోజు 8 నామినేషన్లు

పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్‌రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి

Published : 25 Apr 2024 06:33 IST

రిటర్నింగ్‌ అధికారి ముజమ్మిల్‌ఖాన్‌కు నామినేషన్‌ పత్రం అందజేస్తున్న పెద్దపల్లి భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్‌, చిత్రంలో ఎమ్మార్పీఎస్‌ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య, భాజపా నాయకుడు బల్మూరి అమరేందర్‌రావు, అభ్యర్థి శ్రీనివాస్‌ సతీమణి గీత, భాజపా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌.

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్‌రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి భాజపా అభ్యర్థిగా గోమాసె శ్రీనివాస్‌ రెండు సెట్ల నామినేషన్‌ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా నీరటి శంకర్‌, కుర్మ మహేందర్‌, మోటం రవీందర్‌, బూడిత తిరుపతి, కాశీ సతీష్‌కుమార్‌, చందనగిరి శ్రీనివాస్‌, పిరిమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా ఇరుగురాల భాగ్యలక్ష్మీ నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారి ముజమ్మిల్‌ఖాన్‌కు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు