logo

ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం

జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది.

Published : 25 Apr 2024 10:56 IST

ఆదిలాబాద్ క్రీడావిభాగం: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిజర్వ్ ఇన్ స్పెక్టర్ మురళీ హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా ఈ శిక్షణ శిబిరాన్ని  సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత లక్ష్యంతో శిక్షకులు నేర్పించిన అంశాలను నిరంతరం సాధన చేయాలని ఆకాంక్షించారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణ, మంచి ఆహార నియమాలు పాటించాలని సూచించారు. కాసేపు బ్యాటింగ్,  బౌలింగ్ చేసి వర్ధమాన క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఆయన వెంట సీనియర్ క్రీడాకారులు రజియుద్దీన్, అతవులాఖాన్, మసూద్, క్రికెట్ కోచ్ విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని