logo

ఇంటర్‌లో మెరిసిన విద్యాకుసుమాలు

బోథ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు.

Published : 25 Apr 2024 06:14 IST

పావని, 980 బైపీసీ,  హాసిని, 433 బైపీసీ

బోథ్‌, న్యూస్‌టుడే: బోథ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో పావని 980 మార్కులు, సంజన 977, సోని 972, చందన 971, మధుష 970 మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో హాసిని 433, ఐశ్వర్య 430 మార్కులు, స్వరూప, పూజిత, నందిని 428, శ్రావ్య, ప్రియాంక 427 మార్కులు సాధించారు. ఆదర్శ పాఠశాలకు చెందిన విద్యార్థులు బైపీసీ విభాగంలో గడ్డల అంజలి 979, శ్రద్ధారెడ్డి 430, మలయ తబస్సుమ్‌ 429 మార్కులు సాధించారు. గురుకుల పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత నమోదైంది.  

ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరంలో  149 మందికి 114 మంది.. ప్రథమ సంవత్సరంలో 122 మంది విద్యార్థులకు 72 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్‌ బి.ధన్‌రాజ్‌ తెలిపారు.

తలమడుగు: సాయిలింగి కస్తూర్బా విద్యాలయంలో ప్రథమ సంవత్సరంలో 55 మంది విద్యార్థులకు 53 మంది ఉత్తీర్ణులయ్యారు. శ్రావణికి బైపీసీలో 440కి 424 మార్కులొచ్చాయి. ద్వితీయ ఫలితాల్లో 48 మందికి 47 మంది పాసయ్యారు.  

ఇచ్చోడ: ఇచ్చోడ కేజీబీవీ కళాశాలలో మొదటి సంవత్సరం 75, రెండో సంవత్సరం 80 శాతం ఉత్తీర్ణత సాధించారు. మైనార్టీ గురుకుల కళాశాలలో 76 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎస్‌కే రైఫ్‌ మొదటి సంవత్సరం హెచ్‌ఈసీ మొదటి సంవత్సరంలో 470/500 మార్కులు సాధించారు.  

తాంసి: తాంసి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 315 మంది పరీక్షలు రాయగా, 264 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం 390 మంది పరీక్షలు రాయగా 282 మంది ఉత్తీర్ణులయ్యారు.  

బేల: బేల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ద్వితీయ ఫలితాల్లో 85.47, ప్రథమ సంవత్సరం 85.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. తెలుగు, మరాఠీ మాధ్యమం కలిపి 241 మంది రాస్తే 206 మంది పాసైనట్లు ప్రిన్సిపల్‌ సూర్యప్రకాష్‌ తెలిపారు. మొదటి సంవత్సరం 258 మంది రాస్తే 221 మంది పాసయ్యారు.  కస్తూర్బాలో ద్వితీయ సంవత్సరంలో 31 మందికి 29 మంది, మొదటి సంవత్సరం 35 మందికి 28 మంది ఉత్తీర్ణులయ్యారని ప్రత్యేకాధికారి నవీన తెలిపారు.  

గుడిహత్నూర్‌: గుడిహత్నూర్‌ ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఇంటర్‌ ద్వితీయ ఫలితాల్లో 94 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్‌ శివాజీ కాలే తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 118 మందికి 108 మంది పాసయ్యారు. ద్వితీయలో 143 మందికి 134 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.  

బజార్‌హత్నూర్‌: బజార్‌హత్నూర్‌ ఆదర్శ పాఠశాలలో ప్రథమ సంవత్సరంలో 67 శాతం, ద్వితీయలో 88 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంత్సరం 48.48, ద్వితీయ సంవత్సరం 40.28 శాతం నమోదైంది.

జైౖనథ్‌: జైనథ్‌ ఆదర్శ పాఠశాలలో మొదటి సంవత్సరం 157 మంది పరీక్ష రాయగా 135 మంది ఉత్తీర్ణులై 86 శాతం, ద్వితీయ సంవత్సరంలో 154 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 142 మంది ఉత్తీర్ణులు కాగా 92 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్‌ జావెద్‌ తెలిపారు. ద్వితీయ సంవత్సరంలో బైపీసీ విభాగంలో పసుపుల సాయి శరత్‌ (980), ఎంపీసీలో బత్తుల కల్పన(973), అందెల్‌వార్‌ రిచా(972), టాకిత్‌ సృష్టి (970), గడ్డం వైశాలి (970), మార్కులు సాధించారని తెలిపారు.  

జైౖనథ్‌: జైనథ్‌ కస్తూర్బాలో ద్వితీయ సంవత్సరంలో సీఈసీ విభాగంలో 24 మందికి 24 మంది పాసయ్యారు. ఎంపీహెచ్‌డబ్ల్యూలో 35 మందికి 35 మంది పాసయ్యారు. ప్రథమ సంవత్సరం సీఈసీలో 41 మందికి 36 మంది పాసయ్యారు. ఎంపీహెచ్‌డబ్ల్యూలో 47 మందికి 45 మంది పాసయ్యారు. మేఘన(484) మార్కులు సాధించినట్లు ప్రత్యేకాధికారిణి వీణాకుమారి తెలిపారు.  

నేరడిగొండ: నేరడిగొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మొదటి సంవత్సరంలో 132 మంది విద్యార్థులకు 87 మంది పాసయ్యారు. ద్వితీయలో 130 మందికి 117 మంది పాసైనట్లు ప్రిన్సిపల్‌ శభానతరన్నమ్‌ తెలిపారు. కేజీబీవీలో మొదటి సంవత్సరంలో 55 మందికి 47 మంది, ద్వితీయ సంవత్సరంలో 36కు 36 మంది విద్యార్థినులు పాసయ్యారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎస్‌ఓ రజిత తెలిపారు. టీటీడబ్ల్యూయూఆర్‌జేసీ బుగ్గారంలో ప్రథమ సంవత్సరంలో 70 మందికి 55 మంది పాసై 78 శాతం, ద్వితీయలో 56 మందికి 55 మంది విద్యార్థినులు 98 శాతం విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్‌ కృష్ణవేణి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని