logo

పల్లెలు భళా.. పట్టణాల్లో డీలా

స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రధానమైన ఆర్థిక వనరులు ఆస్తి పన్నులే. ఆర్థిక సంఘం, ప్రత్యేకాభివృద్ధి నిధులతో పంచాయతీలు, పురపాలక సంఘాల్లో సీసీ రహదారులు, నీటి సరఫరా, విద్యుత్‌ దీపాల నిర్వహణ, మరమ్మతు పనులు చేపడుతున్నారు.

Published : 28 Mar 2024 03:17 IST

పన్నుల చెల్లింపునకు సమీపిస్తున్న గడువు

కత్‌గాం గ్రామ పంచాయతీ కార్యాలయం

భైంసా, న్యూస్‌టుడే: స్థానిక సంస్థల అభివృద్ధికి ప్రధానమైన ఆర్థిక వనరులు ఆస్తి పన్నులే. ఆర్థిక సంఘం, ప్రత్యేకాభివృద్ధి నిధులతో పంచాయతీలు, పురపాలక సంఘాల్లో సీసీ రహదారులు, నీటి సరఫరా, విద్యుత్‌ దీపాల నిర్వహణ, మరమ్మతు పనులు చేపడుతున్నారు. ఈ నిధులను ప్రభుత్వాలు సకాలంలో నిధులు విడుదల చేయక పోవడంతో ఆస్తి పన్నులే ఆధారమవుతున్నాయి. కానీ ఆస్తి పన్నుల చెల్లింపుల్లో యజమానులు నిర్లక్ష్యంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. వాటిపై అపరాధ రుసుముతో మరింత భారమవుతోంది. దీంతో ప్రభుత్వం పురపాలికల్లో అపరాధ రుసుముపై 90శాతం రాయితీ కల్పిస్తూ మార్చి 31వరకు అవకాశం ఇచ్చింది. అయినా చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో పుర అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గడువు సమీపిస్తున్నా 50 శాతం మంది తమ ఆస్తి పన్నులు చెల్లించలేదు. పలు చోట్ల ఆస్తులకు సీజ్‌ చేసినా స్పందించడం లేదు. ఇది ఇలా ఉంటే గ్రామీణ ప్రాంత ప్రజలు పన్నుల చెల్లించి పంచాయతీల అభివృద్ధికి దన్నుగా నిలుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీల్లో 90శాతం పన్నులు వసూలైనట్లు అధికారులు తెలుపుతున్నారు. కొన్ని పంచాయతీలు ఇప్పటికే 100శాతం పన్నులు వసూలు చేసి ఆదర్శంగా నిలిచాయి.

వంద శాతం పన్ను చెల్లింపు

ఆర్థిక సంవత్సరం గడువు ముగుస్తున్న వేళ అధికారులు ఆస్తి పన్నుపై దృష్టి సారించారు. పలు గ్రామాల్లో ప్రజలు వందశాతం పన్నులు చెల్లించి ఆదర్శంగా నిలుస్తున్నారు. సోన్‌ మండల సంగంపేట, కుభీరు మండలం రంజని, కుంటాల మండలం అంబకంటి తండా, మెదాన్‌పూర్‌, వెంకూరు, అందకూరు, తానూరు మండలం జౌల(కె), హిప్నెల్లి, నంద్‌గాం, బోల్సా, కోలూరు తండా, బోంద్రట్‌, సింగన్‌గాం, సారంగాపూర్‌ మండలం పెండల్‌ధరి, సోనాపూర్‌, పెంబి మండలం ఎంగ్లాపూర్‌, కర్నంలొద్ది, దూంధరి, కోసగుట్ట, పస్పుల, నాగాపూర్‌, షెట్పల్లి, జంగగూడ, లొట్కూర తండా, పోచంపల్లి, పుల్గపాండ్రి, యాపల్‌గూడ, రాంనగర్‌, తాటిగూడ, ఖానాపూర్‌ మండలం మాస్కాపూర్‌, కొలాంగూడ, చందునాయక్‌ తండా, దస్తూరాబాదు మండలం పెర్కపల్లి, నర్సాపూర్‌(జి)మండలం నందన్‌, బామ్ని(బి), దిలావర్‌పూర్‌ మండలం కంజర్‌, మాయాపూర్‌, సాంగ్వి గ్రామ పంచాయతీల్లో 100శాతం ఆస్తి పన్నులు వసూలయ్యాయి. మరో వంద పంచాయతీల్లో 90శాతం పన్నులు చెల్లించారు.


అవకాశాన్ని వినియోగించుకోవాలి

వెంకటేశ్వర్లు, కమిషనర్‌, పురపాలక సంఘం, భైంసా

పురప్రజలు ఆస్తిపన్నులను సకాలంలో చెల్లించి అభివృద్ధికి సహకరించాలి. బకాయిల అపరాధ రుసుములో ప్రభుత్వం 90 శాతం రాయితీ ఇస్తోంది. ఈ అవకాశం ఈ నెల 31వరకు ఉంది. యజమానులు ఆస్తి పన్ను సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని