logo

ఆదిలాబాద్‌లో బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు

ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం ఉదయం  న్యాయస్థానం ఆవరణలో  ప్రారంభమయ్యాయి.

Published : 28 Mar 2024 11:44 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు గురువారం ఉదయం  న్యాయస్థానం ఆవరణలో  ప్రారంభమయ్యాయి.  ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. న్యాయవాదులంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు వివిధ పదవులకు ఎన్నికల అధికారి ముస్కు రమణారెడ్డి ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ రెండు గంటల వరకు కొనసాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు పూర్తి చేసి ఫలితాలను ప్రకటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని