logo

తొలిరోజు రెండు నామపత్రాలు

లోక్‌సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి.

Published : 19 Apr 2024 06:14 IST

రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషాకు నామినేషన్‌ను అందజేస్తున్న ఆదార్‌ పార్టీ అభ్యర్థి మాలోత్‌ శ్యామ్‌లాల్‌ నాయక్‌, స్వతంత్ర అభ్యర్థి రాఠోడ్‌ సుభాష్‌

పాలనాప్రాంగణం, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. రిటర్నింగ్‌ అధికారి రాజర్షిషా కలెక్టరేట్లోని తన ఛాంబరులో అభ్యర్థుల నుంచి నామపత్రాలు స్వీకరించారు. తొలి నామపత్రాన్ని ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడ్‌ గ్రామానికి చెందిన మాలోత్‌ శ్యామ్‌లాల్‌నాయక్‌ అలయన్స్‌ ఆఫ్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఆదార్‌) పార్టీ అభ్యర్థిగా ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానానికి అందజేశారు. ఇచ్చోడ మండలం గేర్జాం గ్రామానికి చెందిన రాఠోడ్‌ సుభాష్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామపత్రం దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరూ తమ నామపత్రాలు దాఖలు చేయకపోవడంతో నామపత్రాల స్వీకరణ ప్రాంతం వద్ద సందడి కనిపించలేదు. మరోవైపు ఆర్‌వో కార్యాలయానికి 100 మీటర్ల దూరం వరకు బారికేడ్లను ఏర్పాటు చేసి లోనికి బయట వ్యక్తులను అనుమతించలేదు. అభ్యర్థి వెంట నలుగురిని లోనికి అనుమతించారు. కుమురం భీం చౌరస్తా నుంచి కలెక్టరేట్కు వెళ్లే దారిని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సామాన్యుల రాకపోకలను నిలిపేశారు. ఎంపీడీవో కార్యాలయ మార్గం గుండా ట్రాఫిక్‌ను మళ్లించారు. విషయం తెలియక చాలామంది కలెక్టరేట్ వరకు వచ్చి ఎండలో తిరుగుముఖం పట్టాల్సి వచ్చింది. ఒకరిద్దరు పోలీసులతో వాగ్వాదం దిగినా ఆంక్షల దృష్ట్యా       కలెక్టరేట్లోకి అనుమతిలేదని స్పష్టం చేయడంతో ఆయా పనుల నిమిత్తం వచ్చిన వారికి అగచాట్లు తప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు