logo

సర్కారు నిర్ణయాలతో గిరిజనులకు మేలు

గిరిజనాభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. చెరపల్లి, కొత్తపాలెం, వీరవరం, జర్రిల గ్రామాల్లో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 29 Nov 2022 01:18 IST

గిరిజనులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

సీలేరు, గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: గిరిజనాభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. చెరపల్లి, కొత్తపాలెం, వీరవరం, జర్రిల గ్రామాల్లో సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి విషయంలో గిరిజనులకు అనుకూలంగానే నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. బాక్సైట్‌ తవ్వకాలకు సంబంధించి 97 జీవో రద్దు, పోడు వ్యవసాయం చేసుకున్న రైతులకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల మంజూరు.. ఇలా అందరికీ మేలు జరిగేలా ఎన్నో నిర్ణయాలు తీసుకుందన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎంపీపీ బోయిన కుమారి, జడ్పీటీసీ సభ్యుడు కిముడు శివరత్నం, సర్పంచులు కాసులమ్మ, కె.రామకృష్ణ, పాంగి కృష్ణారావు, ఎంపీటీసీ సభ్యులు జోరంగి సరస్వతి, అడపా లోవకుమారి, మండల వైకాపా అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని