logo

పాలకులు పట్టించుకుంటే మేలు వెలుగుచూడని అందాలెన్నో!

ఆంధ్రాఊటీ అరకులోయలో కొత్త అందాలకు కొదవే లేదు.

Updated : 04 Dec 2022 05:40 IST

బొండాం వద్ద రైలు ప్రయాణం

అరకులోయ, ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ఆంధ్రాఊటీ అరకులోయలో కొత్త అందాలకు కొదవే లేదు. అరకులోయ మండలం బొండాం పంచాయతీ కేంద్రానికి ఆమడ దూరంలోని గలగలా పారే వాగు.. .బండరాళ్ల మధ్య కూర్చొని ప్రకృతి రమణీయ దృశ్యాల ఆస్వాదన.. .అక్కడి నుంచే సుందరంగా కనిపించే కొండల నడుమ సాగే రైలు ప్రయాణం సందర్శకులకు మర్చిపోలేని అనుభూతి మిగులుస్తాయి.  బొండాం పరిసర ప్రాంతంలోని ఈ సుందర దృశ్యాల చెంతకు పర్యటకులు చేరాలంటే పాలకులు కొంత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

ముంచంగిపుట్టు - పెదబయలు మండలాల సరిహద్దు ప్రాంతంలో 120 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న తారాబు జలపాతం పాలనురగల అందాలతో ఆకట్టుకుంటోంది. దీని గురించి ఇటీవల కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పచ్చని కొండల మధ్య వున్న జలపాతం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

జాలువారుతున్న తారాబు జలపాతం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని