logo

మత్తుకు చిక్కితే జీవితం చిన్నాభిన్నం

మన్యంలోని గిరిజన యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితాలను ఆనందమయం చేసుకోవాలని హీరోలు శ్రీకాంత్‌, రాహుల్‌, హీరోయిన్‌ శివాని కోరారు. అరకులోయ మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ గంగుడి గ్రామంలో ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొన్నారు.

Published : 06 Feb 2023 02:58 IST

సినీనటుడు శ్రీకాంత్‌

ర్యాలీలో హీరోలు శ్రీకాంత్‌, రాహుల్‌, హీరోయిన్‌ శివాని, పోలీసులు

అరకులోయ, న్యూస్‌టుడే: మన్యంలోని గిరిజన యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితాలను ఆనందమయం చేసుకోవాలని హీరోలు శ్రీకాంత్‌, రాహుల్‌, హీరోయిన్‌ శివాని కోరారు. అరకులోయ మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ గంగుడి గ్రామంలో ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. హీరోయిన్‌ శివానీ, నటుడు శ్రీకాంత్‌ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని యువత కొంతమంది అక్రమార్కుల వలలో పడి గంజాయి వంటి మత్తు పదార్థాలు రవాణా చేస్తూ నిండు జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారన్నారు. గిరిజన యువత సన్మార్గంలో నడచుకోవాలని కోరారు. అక్రమార్కుల వలలో గిరి యువత చిక్కుకోకుండా చదువుపై దృష్టి సారించాలన్నారు. అరకులోయ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీకోసం మీ పోలీస్‌ కార్యక్రమం చాలా బాగుందన్నారు. గిరిజన యువత ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందడుగు వేయాలని వారు కోరారు. ‘దొరసాని’ సినిమా షూటింగ్‌లో భాగంగా మన్యంలో హీరోలు శ్రీకాంత్‌, రాహుల్‌, హీరోయిన్‌ శివాని, మన్యంలో ఉన్నారు. సీఐ దేముడుబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని