logo

రాములోరి సారె ఊరేగింపు

వేంపాడులో మంగళవారం రాములవారి సారె ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగింది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏటా ఇక్కడ సారె ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది.

Published : 17 Apr 2024 02:19 IST

నక్కపల్లి, న్యూస్‌టుడే: వేంపాడులో మంగళవారం రాములవారి సారె ఊరేగింపు భక్తిశ్రద్ధలతో సాగింది. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఏటా ఇక్కడ సారె ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. మహిళలు తమ ఇళ్లలో తయారు చేసిన వివిధ రకాల మిఠాయిలను పళ్లాలతో తీసుకుని రాగా, రాముల వారిని పల్లకీలో ఉంచిన పండితులు వీధుల్లో ఊరేగించారు. అనంతరం దీన్ని తీసుకెళ్లి రామాలయంలో ఉంచారు. నవమి వేడుకల్లో సారెను స్వామివారికి సమర్పించనున్నారు. మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


శ్రీరామ రామ రామేతి..

నక్కపల్లి, న్యూస్‌టుడే: శ్రీరామ నవమిని పురస్కరించుకుని నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మకళాకారుడు, గిన్నీస్‌ రికార్డు గ్రహీత, డాక్టర్‌ గట్టెం వెంకటేష్‌ పెన్సిల్‌ముల్లుపై రఘురాముని చక్కని రూపాన్ని అద్భుతంగా మలిచాడు. 8 మి.మీ.వెడల్పు, 20 మి.మీ.ఎత్తుతో ఈ రూపాన్ని మలిచేందుకు సుమారు ఆరు గంటల సమయం పట్టినట్లు వెంకటేష్‌ వెల్లడించారు.ః  నక్కపల్లి మండలంలోని చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు, వండ్రంగి దార్ల కృష్ణ చెక్కపై రామనామాలు తయారు చేశారు. ఇందుకు సుమారు మూడు గంటల సమయం పట్టినట్లు ఆయన వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని