logo

‘రాజీనామా చేయాలని వాలంటీర్లపై ఒత్తిడి’

మండలంలో పనిచేస్తున్న వాలంటీర్లు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారని సీపీఎం  మండల కార్యదర్శి నాగులు బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.

Published : 18 Apr 2024 01:45 IST

అనంతగిరి, న్యూస్‌టుడే: మండలంలో పనిచేస్తున్న వాలంటీర్లు రాజీనామా చేయాలని ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకొస్తున్నారని సీపీఎం  మండల కార్యదర్శి నాగులు బుధవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. వాలంటీర్లు రాజీనామా చేసి వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేయాలని రెండు వారాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. దీన్ని వాలంటీర్లు బయటకు చెప్పుకోలేకపోతున్నారన్నారు. ఎన్నికల సంఘం ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని