logo

వైభవంగా సీతారామ కల్యాణం

శ్రీరామనవమి సందర్భంగా బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కల్యాణంతో శ్రీరామ గిరులు తరించాయి.

Published : 18 Apr 2024 02:21 IST

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే:  శ్రీరామనవమి సందర్భంగా బుధవారం అంగరంగ వైభవంగా జరిగిన సీతారాముల కల్యాణంతో శ్రీరామ గిరులు తరించాయి. వీక్షించిన భక్తజనం పులకించారు. కల్యాణాన్ని అర్చకులు పురుషోత్తమాచార్యుల బృందం శాస్రోక్తంగా నిర్వహించింది.. తొలుత ఉత్సవర్లును ప్రత్యేక పల్లకిలో ఉంచి, మేళతాళలు, భక్తుల జయజయధ్వానాలతో కొండపై నుంచి గ్రామంలోని కల్యాణ మండపానికి తీసుకు వచ్చారు. ప్రత్యేక ఆసనాలపై సీతారాములను ఉంచి, పెళ్లి తంతు నిర్వహించారు. 

దేవాదాయ శాఖ ఉప కమిషనర్‌ చంద్రశేఖర్‌, ఈవో లక్ష్మీకుమార్‌, ఐటీడీఏ పీవో చైతన్య, ఏఎస్‌డీఎస్‌ డైరెక్టర్‌ గాంధీబాబుతోపాటు పలువురు భక్తులు, వివిధ దేవస్థానాల నుంచి వచ్చిన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను స్వామి వారికి సమర్పించారు. నిర్ధేశిత లగ్నంలో జీలకర్రబెల్లం అమ్మ, అయ్యవారి శిరస్సున ఉంచారు. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం నుంచి అధికసంఖ్యలో భక్తులు ఎండను లెక్కచేయకుండా గోదావరి దాటి స్వామివారి కల్యాణానికి వచ్చారు. భక్తులకు ఓంకార్‌ ట్రస్టు, సమరసత సేవా సంస్థ ఆధ్వర్యంలో పానకం, భద్రాద్రి కూరగాయల మార్కెట్‌ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. సర్పంచి పులి సంతోశ్‌, సరోజిని, జడ్పీటీసీ సభ్యుడు రంగారెడ్డి, ఏఎస్పీ రాహుల్‌ మీనా, సీఐ రామారావు, ఎస్సై నాగారాజు, తహసీల్దార్‌ మౌలానా ఫాజిల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని