logo

జగన్‌ బాదుడును ప్రజలకు గుర్తుచేయండి

ఐదేళ్లగా జగన్‌ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు.

Updated : 24 Apr 2024 04:51 IST

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ఐదేళ్లగా జగన్‌ ప్రభుత్వం సామాన్యులపై బాదుడును ప్రజలకు వివరించాలని తెదేపా జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్యబాబు పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో మంగళవారం తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక లభించకుండా చేసి కార్మికులను రోడ్డుమీదకు లాగి ఆనందం పొందారన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు పెరిగిపోయాయన్నారు. విద్యుత్తు ఛార్జీలు, ఆర్టీసీ, మద్యం ధరలు పెంచి పేదల జీవితాలతో వ్యాపారం చేసిన మోసగాడు జగన్‌ అనే విషయం ప్రజల్లోకి ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. ఈనెల 24న జరిగే సీఎం రమేశ్‌ నామినేషన్‌ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి భారీగా జనాలను తీసుకురావాలని ఆయన కోరారు. ఎలమంచిలి తెదేపా ఇన్‌ఛార్జి ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన
అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్సీలు బుద్ధ నాగజదీశ్వరరావు, పీవీఎన్‌ మాధవ్‌, భాజపా కన్వీనర్‌ రాజాన సన్యాసినాయుడు, రాజాన రమేష్‌కుమార్‌, సీఎం రాజేశ్‌, డ్రీమ్స్‌ నాయుడు, డొక్కా నాగభూషన్‌, రాజాన విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు