logo

ఘంటసాలకు భారత రత్న ఇవ్వాలి

మధురు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం భారత రత్న పురస్కారంతో గౌరవించాలని ఘంటసాల వంశీకుడైన ఘంటసాల సుబ్రమణ్య ప్రసాద్‌ కోరారు.

Published : 05 Dec 2022 05:35 IST

చౌటపల్లిలో అమర గాయకుని విగ్రహానికి పూల మాలలు వేసి
నివాళులర్పిస్తున్న ఘంటసాల వంశీకుడు సుబ్రమణ్య ప్రసాద్‌

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: మధురు గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకు ప్రభుత్వం భారత రత్న పురస్కారంతో గౌరవించాలని ఘంటసాల వంశీకుడైన ఘంటసాల సుబ్రమణ్య ప్రసాద్‌ కోరారు. ఘంటసాల శతజయంతి వేడుకల సందర్భంగా వెంకటేశ్వరరావు అమ్మమ్మగారి గ్రామమైన గుడివాడ మండలం చౌటపల్లిలో ఆదివారం ఆయన విగ్రహానికి పూల దండలు వేసి నివాళులర్పించారు. ఈ సభలో పలువురు సంగీత కళాకారులను సత్కరించారు. ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. గ్రామ పెద్దలు అట్లూరి గాంధీ, అట్లూరి తిరుమలరావు, ఘంటసాల బసవయ్య, సంగీత కళాకారుల నాయకుడు పసుపులేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అవనిగడ్డ, న్యూస్‌టుడే: తెలుగు పాట ఉన్నంత కాలం అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ చెప్పారు. ఘంటసాల శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం గాంధీక్షేత్రంలో దివిసీమ లలిత కళా సమితి, గాంధీక్షేత్రం కమటీ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఘంటసాల పాడిన పాటలపై నిర్వహించిన పోటీల్లో విజేతలైన వారికి ఆయన బహుమతులు ప్రదానం చేశారు. పుప్పాల వీరాంజనేయులు, కూనపరెడ్డి చంద్రశేఖర్‌రావు, నారేపాలెం వేణు, మత్తి శ్రీనివాసరావు, జి.విష్ణుప్రసాద్‌, బీహెచ్‌వీ.రమణ, తదితరులు పాల్గొన్నారు.

విజేతకు బహుమతి ప్రదానం చేస్తున్న బుద్ధప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని