logo

చిన్నారుల్లో జోష్‌

పిల్లల నృత్యాలతో బాలోత్సవం ఉత్సాహంగా సాగింది. పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్‌ కళాశాలలో బాలోత్సవంలో రెండో రోజు సోమవారం వివిధ అంశాల్లో పోటీలు జరిగాయి.

Published : 31 Jan 2023 04:15 IST

సందడిగా బాలోత్సవం

పల్లె పాటలకు నృత్యరూపం

చిట్టినగర్‌, న్యూస్‌టుడే: పిల్లల నృత్యాలతో బాలోత్సవం ఉత్సాహంగా సాగింది. పొట్టిశ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజినీరింగ్‌ కళాశాలలో బాలోత్సవంలో రెండో రోజు సోమవారం వివిధ అంశాల్లో పోటీలు జరిగాయి. సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌ విభాగాల్లో జానపద, శాస్త్రీయ నృత్యాల పోటీలలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సుమారు 3,600 మంది విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తమ ప్రతిభ చాటారు. జానపద గీతాలాపన, దేశభక్తి, అభ్యుదయ గీతాలు ఆకట్టుకున్నాయి. కరోనా ప్రబలినప్పుడు ప్రజలు పడిన పాట్లు, అటు వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ప్రచార మాధ్యమాలు కలిసికట్టుగా పని చేసి కరోనాను ఎదుర్కొన్న తీరు, పరమానందయ్య శిష్యుల కథలు, సమాజంలో పేరుకుపోయిన అవినీతి, అక్రమాలు, ఇతర రుగ్మతలను, దేశ రక్షణలో ఇండియన్‌ ఆర్మీ వంటి వాటిని చిన్నారులు లఘునాటిక ద్వారా ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. సైన్సు ప్రదర్శనలో కాలుష్యాన్ని ఏ విధంగా తరిమి కొట్టవచ్చు, వ్యర్థాల నుంచి ఎన్ని రకాలుగా విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు, విద్యుత్తు ఆదా, నీటి ప్రాజెక్టులు వంటి నమూనాలు ఆలోచింపజేశాయి. వ్యాసరచన, స్పెల్‌బీ, మెమెరీ పరీక్ష, చిత్రలేఖనం, కార్టూన్‌ వంటి పోటీలు జరిగాయి.

చిత్రలేఖనం పోటీల్లో విద్యార్థులు

పరమానందయ్య శిష్యుల కథలో చిన్నారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని