తెగిపోయిన గూడ్స్ రైలు లింక్
ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు లింకు తెగిపోవడంతో ఆదివారం పలు రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది.
ఖమ్మం-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
మధిర పట్టణం, న్యూస్‌టుడే: ఖమ్మం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు లింకు తెగిపోవడంతో ఆదివారం పలు రైళ్ల రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్స్ రైలు లింకు ఖమ్మం జిల్లా మధిర పట్టణం సమీపంలోని వైరానది బ్రిడ్జి వద్ద మధ్యాహ్నం 12 గంటల సమయంలో తెగిపోయింది. దీంతో విడిపోయిన బోగీలతో సహా ఇంజిన్ అరకిలోమీటరు దూరం వెళ్లి ఆగిపోయింది. గార్డ్, డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. తర్వాత బోగీలను తీసుకొచ్చి గూడ్స్‌కు కలిపారు. దీంతో మోటమర్రి రైలు నిలయంలో కృష్ణా, ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సుమారు 3 గంటలపాటు నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
మా అమ్మ కన్నీటితో డైరీ తడిసిపోయింది
-
Ts-top-news News
నేటి నుంచి బీఎస్-6.2 నిబంధన అమలు
-
Ts-top-news News
ఇందూరులో పసుపు బోర్డు ఫ్లెక్సీల కలకలం
-
Sports News
IPL: అటు తుషార్.. ఇటు సుదర్శన్: తొలి మ్యాచ్లోనే అమల్లోకి ఇంపాక్ట్ ప్లేయర్ విధానం
-
Ts-top-news News
నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కొత్త టోల్ఛార్జీలు
-
World News
America: ‘ఆయుధాలు ఇచ్చి ఆహారధాన్యాలు తీసుకో’.. రష్యా తీరుపై అమెరికా ఆందోళన..!