logo

బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ

న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలు మన సమస్యగా భావించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఎస్పీ జి.జాషువా పోలీసు అధికారులకు సూచించారు.

Published : 07 Feb 2023 03:26 IST

బాధితురాలి సమస్య వింటున్న జాషువా

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: న్యాయం కోసం పోలీస్‌ స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలు మన సమస్యగా భావించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఎస్పీ జి.జాషువా పోలీసు అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి  నుంచి ఎస్పీతో పాటు ఏఎస్పీ ఎన్‌వీ రామాంజనేయులు, ఇతర అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. వాటిని పరిశీలించిన ఎస్పీ తగు చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్తి కోసం కన్నబిడ్డే తన ప్రాణాలు తీసేందుకు చూస్తున్నాడని పెడనకు చెందిన సూర్యనారాయణ,  దుర్వసనాల బారిన పడిన భర్త భౌతికదాడికి పాల్పడుతూ గర్భస్రావానికి కారకుడయ్యాడని గన్నవరం ప్రాంతానికి చెందిన నవీన, మరణించిన భర్తకు వచ్చిన బీమా సొమ్ము, తన కూతురు పేర ఉన్న ఆస్తిని అత్తింటివారు దోచుకున్నారని, పమిడిముక్కల మండలానికి చెందిన నాగలక్ష్మి ఫిర్యాదు చేశారు. వివిధ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతూ వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు అర్జీలు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని