logo

కూటమి ప్రభంజనం ఖాయం

ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అన్నారు.

Published : 18 Apr 2024 05:09 IST

ఎన్టీఆర్‌ జిల్లా తెదేపా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌

మాట్లాడుతున్న నెట్టెం, పక్కన తెదేపా కూటమి అభ్యర్థులు కేశినేని చిన్ని, తాతయ్య తదితరులు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం ఖాయమని తెదేపా ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ అన్నారు. బుధవారం జగ్గయ్యపేటలో తెదేపా కూటమి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నెట్టెం రఘురామ్‌ హాజరయ్యారు. తెదేపా కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని చిన్ని, శ్రీరాం తాతయ్య పాల్గొన్నారు. రఘురామ్‌ మాట్లాడుతూ... కూటమిలోని పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంగా పని చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. కేశినేని చిన్ని, శ్రీరాం తాతయ్యలను గెలిపించాలని కోరారు. జగ్గయ్యపేటలో తనకు, శ్రీరాం తాతయ్యకు విభేదాలు ఉన్నాయని వైకాపా అనుకూల మీడియా ప్రచారం చేస్తోందని, అందులో వాస్తవం లేదని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. చిన్ని మాట్లాడుతూ... రాష్ట్రంలో వైకాపా పని అయిపోయిందని, అందుకు విజయవాడలో జరిగిన సీఎం బస్సు యాత్రే ఉదాహరణ అని అన్నారు. జగన్‌ గులకరాయి డ్రామాలు ఆడుతున్నారని, అందులో విజయవాడకు చెందిన అమాయకులైన బీసీ యువకులను బలి చేయబోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాతయ్య మాట్లాడుతూ... కూటమి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా శ్రమించాలని కోరారు. నాయకులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, ఆచంట సునీత, కట్టా నరసింహారావు, వడ్లమూడి రాంబాబు, చింతల సీతారామయ్య, కన్నెబోయిన రామలక్ష్మి, తాళ్లూరు వెంకటేశ్వర్లు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాడిశ మురళీకృష్ణ, భాజపా నాయకుడు ప్రపుల్లకుమార్‌ శ్రీకాంత్‌, జిల్లేపల్లి సుధీర్‌బాబు, వెల్ది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని