logo

అనిశాకు చిక్కిన పౌరసరఫరాల అధికారి

ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్‌ చెన్నూరి శ్రీనివాస్‌ అనిశా వలకు చిక్కారు.

Published : 18 Apr 2024 05:22 IST

శ్రీనివాసరావు, డీటీ

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: ఓ బియ్యం వ్యాపారి నుంచి నెలవారీ మామూలు తీసుకుంటూ పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్‌ చెన్నూరి శ్రీనివాస్‌ అనిశా వలకు చిక్కారు. అనిశా ఏఏస్పీ స్నేహిత తెలిపిన వివరాల మేరకు జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న శ్రీనివాస్‌ గత కొంత కాలంగా బియ్యం వ్యాపారం చేసుకునే అవనిగడ్డకు చెందిన వినయకుమార్‌ను బెదిరించి నెలవారీ మామూలు వసూలు చేస్తున్నారు. అవనిగడ్డలోని ఆయన గోదాములు తనిఖీ చేయకుండా, ఎటువంటి కేసులు నమోదు చేయకుండా ఉండేందుకు ఇప్పటికే వివిధ రూపాల్లో కొంతమొత్తం వసూలు చేశారు. ఈనెలకు సంబంధించిన మామూలు రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయడంతో వినయకుమార్‌ అనిశాను ఆశ్రయించారు. పథకం ప్రకారం బుధవారం మచిలీపట్నంలోని ఓ పెట్రోల్‌బంక్‌ సమీపంలో వినయకుమార్‌ నుంచి రూ.10వేలు తీసుకుంటుండగా శ్రీనివాస్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అనిశా అధికారులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని