logo

కృత్రిమ మేధలో నిపుణుడినవుతా

బుధవారం విడుదలైన పాలిసెట్‌-2024 ఫలితాల్లో విజయవాడకు చెందిన కొల్లి నిఖిలేష్‌ సాయి రాష్ట్ర స్థాయిలో 51వ ర్యాంక్‌ సాధించాడు. తండ్రి కృష్ణప్రసాద్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌, తల్లి సాయిలక్ష్మి గృహిణి.

Published : 09 May 2024 04:08 IST

పాలిసెట్‌ 51వ ర్యాంకర్‌ కొల్లి నిఖిలేష్‌ సాయి

గుడ్లవల్లేరు, లక్ష్మీపురం (చŸల్లపల్లి), న్యూస్‌టుడే: బుధవారం విడుదలైన పాలిసెట్‌-2024 ఫలితాల్లో విజయవాడకు చెందిన కొల్లి నిఖిలేష్‌ సాయి రాష్ట్ర స్థాయిలో 51వ ర్యాంక్‌ సాధించాడు. తండ్రి కృష్ణప్రసాద్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌, తల్లి సాయిలక్ష్మి గృహిణి. నిఖిలేష్‌ సాయి పదో తరగతి వరకు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌లో చదివాడు. గత నెలలో విడుదలైన ఫలితాల్లో 10కి 10 గ్రేడ్‌ సాధించాడు. గుడ్లవల్లేరులో తీసుకున్న ప్రవేశపరీక్ష శిక్షణ, పాలిసెట్‌ పరీక్షలపై యూట్యూబ్‌లో ఉన్న వీడియోలు తనకు ఎంతగానో ఉపకరించాయన్నారు. తనకు కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో నిపుణుడిగా స్థిరపడాలని ఉందని తెలిపారు.

ఆటో డ్రైవర్‌ కుమారుడికి 195వ ర్యాంక్‌

పాలిటెక్నిక్‌ ఫలితాల్లో చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ శివరామదుర్గాపురం (సాలిపేట)కు చెందిన కుమ్మరగుంట విక్రాంత్‌ రాష్ట్రస్థాయిలో 195వ ర్యాంక్‌ సాధించాడు. పదో తరగతి, పాలిటెక్నిక్‌ ఎంట్రాన్స్‌ పుస్తకాలు ఎక్కువగా అభ్యసించినట్లు విద్యార్థి విక్రాంత్‌ తెలిపాడు. తండ్రి జగన్‌మోహనరావు ఆటో డ్రైవర్‌ కాగా తల్లి సురేఖ గృహిణి. విక్రాంత్‌కు రాష్ట్రస్థాయి ర్యాంక్‌ రావడం పట్ల చల్లపల్లికి చెందిన విద్యాశాఖాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని