logo

అన్ని వర్గాలనూ మోసగించిన రాష్ట్ర ప్రభుత్వం

భూములు ఆక్రమించుకోవటం.. ఇసుకతో డబ్బులు దండుకోవటం.. మద్యంతో డబ్బు సంపాదించే ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం మారిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు.

Published : 09 Aug 2022 04:07 IST

ప్రసంగిస్తున్న భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే : భూములు ఆక్రమించుకోవటం.. ఇసుకతో డబ్బులు దండుకోవటం.. మద్యంతో డబ్బు సంపాదించే ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం మారిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి విమర్శించారు. భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో యువ సంఘర్షణ యాత్ర సోమవారం హిందూపురంలో చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించిన అనంతరం అంబేడ్కర్‌ కూడలిలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తోందని విమర్శించారు. రాయలసీమ రైతులకు అన్యాయం జరుగుతున్నా ఈ ప్రాంతానికి చెందిన నాయకులెవరూ ఆదుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలకు సొమ్ము జమ చేస్తోంది. ఉచిత బియ్యం పంపిణీ, వ్యాక్సిన్‌ ఇస్తోందన్నారు. వికృత చేష్టలకు పాల్పడిన ఎంపీ గోరంట్లమాధవ్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో భాజపా నాయకులు చంద్రమౌళి, రమేష్‌నాయుడు, గంగాధర్‌, పీడీ పార్థసారథి, రమేష్‌రెడ్డి, ఆదర్శకుమార్‌, రవితేజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని