logo

శింగనమలలో కలకలం

శింగనమల కస్తూర్బా విద్యాలయంలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం విద్యార్థినులు ఒక్కొక్కరూ కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Published : 03 Dec 2022 02:35 IST

80 మంది విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలు

శింగనమల, న్యూస్‌టుడే: శింగనమల కస్తూర్బా విద్యాలయంలో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం విద్యార్థినులు ఒక్కొక్కరూ కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇలా దాదాపు 80 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 30  మంది విద్యార్థినుల పరిస్థితి కొంత విషమంగా ఉండటంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మిగిలిన 50 మంది విద్యార్థినులు స్థానిక ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. విద్యాలయంలో సాయంత్రం అల్పాహారంగా బొరుగులు తిని బూస్టు తాగినట్లు విద్యార్థినులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో మజ్జిగ సరిగా లేవని చెప్పారు. అల్పాహారం తీసుకున్న తర్వాత విద్యార్థినులకు కడుపు నొప్పి ప్రారంభమైంది. ఆ తర్వాత పలువురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. భరించలేని కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు తరలివచ్చారు. తహసీల్దారు ఈశ్వరమ్మ, ఎంపీడీఓ నిర్మలకుమారి, ఎంఈఓ నరసింహరాజు, కేజీబీవీ సిబ్బంది విద్యార్థినుల వద్ద ఉండి వైద్య సేవలను పర్యవేక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని