logo

ఉపాధి కల్పనకు 284 యూనిట్లు

ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 284 యూనిట్ల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి సహాయ సంచాలకుడు ఐజయ్య తెలిపారు.

Published : 04 Dec 2022 04:35 IST

అనంతపురం (శ్రీనివాస్‌నగర్‌): ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 284 యూనిట్ల ద్వారా రుణ సదుపాయం కల్పిస్తామని ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి సహాయ సంచాలకుడు ఐజయ్య తెలిపారు. ఈ యూనిట్లలో భాగంగా మార్జిన్‌ రూపంలో రూ.8.24 కోట్లు నిధులు వచ్చాయన్నారు. ఇప్పటికే 96 యూనిట్లు స్థాపించామన్నారు. ఉత్పత్తి, సేవా రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పడానికి ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. నిర్దేశిత ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 21న జరిగే రుణమేళాలో రుణాలు మంజూరీ చేయిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని