logo

‘ప్రజల్లోకెళితే చెప్పుతో కొడతారు’

వార్డుల్లో నెలకొన్న సమస్యలపై నెత్తి నోరు కొట్టుకుంటున్నాం.. మీకు పట్టడం లేదు. ఎన్నికల్లో ప్రజల్లోకి వెళితే చెప్పులతో కొడతారని బుధవారం గుత్తి పురపాలిక సంఘం అధ్యక్షురాలు వన్నూరుబీ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి వాపోయారు.

Published : 01 Jun 2023 04:24 IST

గుత్తి పురపాలక సమావేశంలో సమస్యలు ప్రస్తావిస్తున్న కౌన్సిలర్లు

గుత్తి : వార్డుల్లో నెలకొన్న సమస్యలపై నెత్తి నోరు కొట్టుకుంటున్నాం.. మీకు పట్టడం లేదు. ఎన్నికల్లో ప్రజల్లోకి వెళితే చెప్పులతో కొడతారని బుధవారం గుత్తి పురపాలిక సంఘం అధ్యక్షురాలు వన్నూరుబీ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి వాపోయారు. వార్డుల్లో సమస్యలు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించాలని సమావేశాల్లో కోరుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. తాము ప్రజల్లో ఎలా తిరగాలని ఆమెతోపాటు పలువురు కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. గత సమావేశంలో నిరాశ్రయుల కేంద్రం నిర్వహణకు రూ.13 లక్షలు బిల్లుపెట్టారు.. అంత మొత్తం ఎలా వ్యయమైందని ప్రశ్నించి అభ్యంతరం వ్యక్తం చేసినా.. దాన్ని ఎలా ఆమోదించారని వరలక్ష్మి, కౌన్సిలర్‌ రూపవతి అధికారులను నిలదీశారు. గతంలో ఏమి జరిగిందో తమకు తెలియదని,  ఇప్పటి నుంచి ఏదైనా సమస్య వస్తే తాను బాధ్యత వహిస్తానని కమిషనర్‌ శ్రీనివాసులు చెప్పారు. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని అడిగే ఎజెండాలో చేర్చామని, తీర్మానాన్ని ఆమోదించామని అధ్యక్షురాలు వన్నూరుబీ చెప్పారు. సమావేశాల్లో సభ్యులతో తీర్మానాల ఆమోదంపై ఓటింగ్‌ నిర్వహించాలని పలువురు డిమాండు చేశారు. పట్టణంలో తాగునీటి సమస్యను ప్రతి సమావేశంలో ప్రస్తావిస్తున్నా ఎవరూ పట్టించుకోలేదన్నారు  సమావేశం ఆసాంతం వాడివేడిగా సాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని