logo

సి-విజిల్‌ ఫిర్యాదులు పరిష్కరించండి

ఎన్నికల నియమావళి మేరకు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతోపాటు, కార్యాలయాల్లో ఎటువంటి రాజకీయ పార్టీల ప్రకటనలు హోర్డింగ్‌లు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు.

Published : 28 Mar 2024 04:47 IST

 

పుట్టపర్తి, న్యూస్‌టుడే : ఎన్నికల నియమావళి మేరకు ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వాణిజ్య స్థలాలతోపాటు, కార్యాలయాల్లో ఎటువంటి రాజకీయ పార్టీల ప్రకటనలు హోర్డింగ్‌లు, పోస్టర్లు, బ్యానర్లను అనుమతించవద్దని కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్‌మీనా జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్ఠంగా అమలు తీరును సమీక్షించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ ప్రధాన రహదారుల పక్కనన్న హోర్డింగ్‌లను అన్ని రాజకీయ పార్టీలకు సమాన ప్రాతిపదికన కేటాయించాలని, నూతన హోర్డింగ్‌లకు అనుమతులు ఇవ్వద్దన్నారు. ప్రైవేట్‌ భవనాలపై వాల్‌ పెయింట్స్‌కు ఎటువంటి అనుమతి లేదని, ఇప్పటికే ఉన్న వాటిని వెంటనే చెరిపేయాలని సూచించారు. సి-విజిల్‌ ద్వారా అందే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్‌కుమార్‌, డీఆర్‌ఓ కొండయ్య, పెనుకొండ సబ్‌కలెక్టర్‌ అపూర్వభరత్‌, ఆర్‌డీఓలు భాగ్యరేఖ, వంశీకృష్ణ, వెంకటశివసాయిరెడ్డి, అహుడా కార్యదర్శి గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని