logo

30 నుంచి భవిత కేంద్రాల్లో శిబిరాలు

ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జల్లాలో గుర్తించిన భవిత కేంద్రాల్లో దివ్యాంగ పిల్లలకు అసెస్మెంట్‌ శిబిరాలు నిర్వహించనున్నట్లు అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ మీనాక్షి తెలిపారు.

Published : 28 Mar 2024 04:48 IST

కొత్తచెరువు : ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జల్లాలో గుర్తించిన భవిత కేంద్రాల్లో దివ్యాంగ పిల్లలకు అసెస్మెంట్‌ శిబిరాలు నిర్వహించనున్నట్లు అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ మీనాక్షి తెలిపారు. ఈ నెల 30న ధర్మవరం మండలలోని ఎల్‌సీకే పురం భవిత కేంద్రంలో నిర్వహించే శిబిరంలో ధర్మవరం, బత్తలపల్లి, రామగిరి, తాడిమర్రి, చెన్నేకొత్తపల్లి, కనగానిపల్లి మండలాలు, ఏప్రిల్‌ 1న కదిరిలో ఓడీసీ, ఎన్పీ కుంట, కదిరి, నల్లచెరువు, గాండ్లపెంట, తనకల్లు, తలుపుల, అమడుగూరు, 2న హిందూపురంలో లేపాక్షి, హిందూపురం, పెనుకొండ, చిలమత్తూరు, సోమందేపల్లి, పరిగి, 3న మడకశిరలో అగళి, మడకశిర, గుడిబండ, రొళ్ల, అమరాపురం, రొద్దం, 4న పుట్టపర్తిలో గోరంట్ల, బుక్కపట్నం, కొత్తచెరువు, నల్లమాడ, పుట్టపర్తి, ముదిగుబ్బ మండలాలకు చెందిన దివ్యాంగులైన పిల్లలు భవిత కేంద్రాల్లో నిర్వహించే అసెస్మెంటు శిబిరాలకు హాజరై సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని