logo

కొత్త వేరుసెనగ వంగడాల పంపిణీకి చర్యలు

వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు.

Published : 29 Mar 2024 04:08 IST

అనంతపురం (వ్యవసాయం), న్యూస్‌టుడే: వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే వేరుసెనగ కొత్త వంగడాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ సూచించారు. గురువారం జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ ఛాంబర్‌లో డివిజన్‌ ఏడీఏలు, శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో టీఎంవీ-2 నాటురకంతో పాటు కదిరి-6 రకాలను కొన్నేళ్లుగా సాగు చేస్తున్నారని, అయితే రాను రాను దిగుబడి గణనీయంగా తగ్గిపోయాయన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి వేరుసెనగ కొత్త రకాల వంగడాలు సేకరించేలా చూడాలన్నారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకుని అధిక దిగుబడినిచ్చే కదిరి-9, కదిరి లేపాక్షి-1812, టీసీజీఎస్‌-1694 (వశిష్ఠ) రకాలను రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. కంది రకాల్లో ఎల్‌ఆర్‌జీ-41 రకానికి బదులు పీఆర్‌జీ-176 రకంతో పాటు కొర్ర రకాలు సూర్యనంది, గరుడ రకాలు జిల్లాలో సాగుకు అనువైనవన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని