logo

ధరల బోర్డులు తెచ్చారు.. మూలన పడేశారు

పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్‌లలో కౌన్సిల్‌ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు.

Published : 29 Mar 2024 04:28 IST

మున్సిపల్‌ కార్యాలయం వద్ద పడేసిన మార్కెట్‌ ధరల బోర్డు

రాయదుర్గం, న్యూస్‌టుడే: పట్టణంలోని దినసరి, వారపు సంత, జంతు వధశాలలో గుత్తేదారుల దోపిడీని అరికట్టేందుకు ఆయా మార్కెట్‌లలో కౌన్సిల్‌ సూచన మేరకు రెవెన్యూ ఉద్యోగులు ధరల బోర్డులను తయారు చేయించి తెచ్చారు. వాటిని మార్కెట్‌లలో పాతకుండా మున్సిపల్‌ కార్యాలయం వద్ద పడేసి 20 రోజులవుతోంది. అడిగేవారు లేక రైతులు, చిన్న వ్యాపారుల నుంచి ఇష్టారాజ్యంగా పన్నులు ముక్కుపిండి వసూలు చేశారు. ఈ మార్కెట్ల ఆదాయాలపైన అధికార వైకాపా నాయకులు కన్నేశారు. మార్కెట్‌ వేలాలను పోటీపడి సాధించుకున్నారు. పురపాలక సంఘానికి ఆదాయం పెరిగినా రైతులను వేలం పాటదారులు దోపిడీ చేస్తున్నారు. గత ఏడాది దినసరి మార్కెట్‌ రూ.26.04 లక్షలు పలకగా ఈ ఏడాది రూ.32.10 లక్షలు, వారపు సంత గత ఏడాది రూ.5.85 లక్షలుకాగా ఈ ఏడాది రూ.15.20 లక్షలు, జంతు వధశాల ఏడాది రూ.2.58 లక్షల ధర అయితే ఈ ఏడాది రూ.3.50 లక్షలు పలికింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త గుత్తేదారులు వస్తున్న నేపథ్యంలో మున్సిపల్‌ అధికారులు వెంటనే మార్కెట్‌ల వద్ద ధరల బోర్డులు ఏర్పాటు చేయాలని వ్యాపారులు, రైతులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని