logo

తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తును బాగుచేద్దాం

సైకిల్‌ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తు తరాలను బాగుచేద్దామని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని విజయనగర్‌ కాలనీలో మంగళలవారం ఆయన పర్యటించారు.

Published : 24 Apr 2024 05:01 IST

క్రిష్టిపాడులో పర్యటిస్తున్న జేసీ ప్రభాకరరెడ్డి

తాడిపత్రి, న్యూస్‌టుడే : సైకిల్‌ గుర్తుకు ఓటేసి తెదేపాను గెలిపిద్దాం.. భవిష్యత్తు తరాలను బాగుచేద్దామని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని విజయనగర్‌ కాలనీలో మంగళలవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం వచ్చాక తాడిపత్రి పురపాలికను సర్వనాశనం చేశారన్నారు. తెదేపా అధికారంలో రాగానే తాడిపత్రి పురపాలికకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.

గార్లదిన్నె గ్రామీణం : రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుకే సాధ్యమవుతుందని మాజీ ఎంపీపీ ముంటిమడుగు శ్రీనివాసరెడ్డి అన్నారు. మర్తాడులో మంగళవారం తెదేపా కూటమి అభ్యర్థి బండారు శ్రావణి సోదరి కిన్నెరశ్రీ తో కలిసి ఆయన ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు సైకిల్‌ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. తెదేపా నాయకుడు ముంటిమడుగు కేశవరెడ్డి, కన్వీనర్‌ పాండు, బీసీ సంఘం జిల్లా అధ్యక్షడు ఆవులకృష్ట పాల్గొన్నారు.

పెద్దవడుగూరు : సార్వత్రిక ఎన్నికల్లో తెదేపాకు ఓటువేసి ఆదరించాలని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకరరెడ్డి ఓటర్లను కోరారు. మండలంలోని క్రిష్టిపాడు, విరుపాపురంలో మంగళవారం పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. ముందుగా ఆయన ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తూ తెదేపా ప్రవేశపెట్టిన సూపర్‌సిక్స్‌ పథకాలతో అన్నివర్గాల వారికి న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం గ్రామానికి చెందిన జనార్దన నాయుడు గేస్ట్‌హౌస్‌లో కార్యకర్తలు, నాయకుల సమావేశం నిర్వహించి గ్రామంలో తెదేపా శ్రేణులంతా వర్గవిభేదాలు లేకుండా కలసికట్టుగా ఎన్నికల్లో తెదేపా గెలుపునకు కృషిచేయాలని సూచించారు. తెదేపా నాయకులు కొండూరు కేశవరెడ్డి, ఆవులాంపల్లి కేశవరెడ్డి, దాదావలి, భోగేశ్వరనాయుడు, ముత్యాలరెడ్డి, చిదంబరరెడ్డి, దస్తగిరి, చిరంజీవులు, నాగరాజు, నగేశ్‌, ప్రసాద్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

బుక్కరాయసముద్రం : ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వాదంతో తెదేపా అధికారంలోకి వస్తే ప్రజల ఇళ్లవద్దకే వచ్చి సంక్షేమ పథకాలు అందిస్తామని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ పేర్కొన్నారు. మంగళవారం ఆమె ద్విసభ్య కమిటీ సభ్యులు నరసానాయుడు, కేశవరెడ్డితో కలిసి అమ్మవారిపేట, రేకులకుంట గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు తెదేపా సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. నాయకులు లింగారెడ్డి, హనుమంతరెడ్డి, శ్రీధర్‌బాబు, అశోక్‌, నారాయణస్వామి, రామకృష్ణ, ఆదిశేషయ్య, రవీంద్ర, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధే తెదేపా లక్ష్యం

గుత్తి గ్రామీణం: నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని గుంతకల్లు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. గుత్తి మండలంలోని ఊటకల్లు, బేతపల్లి, వెంకన్నపల్లి గ్రామాల్లో మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో గ్రామాలు అంధకారంలోకి వెళ్లాయన్నారు.  మండల కన్వీనర్‌ బద్రి, వలి, ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, యాంగన్నపల్లి సర్పంచి భరత్‌ కుమార్‌, ప్రతాప్‌, గోవిందు పాల్గొన్నారు.

సైకో పాలన పోవాలి.. చంద్రన్న రావాలి..

శింగనమల: సైకో పాలన పోవాలంటే సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి బండారు శ్రావణిశ్రీని గెలిపించాలని తెదేపా మండల నాయకులు ఓటర్లను అభ్యర్థించారు. నిదనవాడ, రాచేపల్లి గ్రామాల్లో మంగళవారం ఇంటింటి ప్రచారం చేశారు. తెదేపా మండల కన్వీనర్‌ గుత్త ఆదినారాయణ, మాజీ ఎంపీపీ అమృత, నాయకులు ఈశ్వర్‌రెడ్డి, డేగల కృష్ణమూర్తి, మారుతీనాయుడు, చండ్రాయుడు, ఓబిరెడ్డి, మాసుల చంద్రమోహన్‌, విజయ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని