logo

తెదేపా మైనారిటీల ఆధ్వర్యంలో ధర్నా

నరసాపురంలో ఇటీవల సీఎం సభకు వచ్చిన ముస్లిం మహిళలను బుర్ఖా తొలగించి అనుమతించడం దారుణమని తెదేపా మైనారిటీ విభాగం నాయకులు ఆరోపించారు.

Published : 29 Nov 2022 02:16 IST

నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా మైనారిటీ నాయకులు

చిత్తూరు కలెక్టరేట్‌: నరసాపురంలో ఇటీవల సీఎం సభకు వచ్చిన ముస్లిం మహిళలను బుర్ఖా తొలగించి అనుమతించడం దారుణమని తెదేపా మైనారిటీ విభాగం నాయకులు ఆరోపించారు. జగన్‌ హఠావో.. బుర్ఖా బచావో నినాదంతో తెదేపా మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతికి ఏ విధంగానూ చర్యలు చేపట్టని వైకాపా ప్రభుత్వంపై అందరిలో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. కలెక్టరేట్‌ వద్ద ధర్నాకు రానీకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రేణుల్ని అడ్డుకోవడం శోచనీయమన్నారు.తెదేపా రాష్ట్ర మైనారిటీ విభాగం ఉపాధ్యక్షుడు ఉమర్‌షేక్‌, నాయకులు నౌషాద్‌, పర్వీన్‌, జాకీర్‌ అహ్మద్‌, ఘనివుల్లా, రహీం నౌషాద్‌, అబ్ధుల్‌ మునాఫ్‌, ఆరీఫ్‌, అత్తు పాల్గొన్నారు. ‌్ర ప్రజా సంఘాల నిరసనల నేపథ్యంలో కలెక్టరేట్‌ వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. స్పందనలో వినతి ఇచ్చేందుకు వచ్చినవారి వాహనాలు బయటే పార్కింగ్‌ చేయించారు. గ్రామ సమస్యపై విన్నవించేందుకు బృందంగా వచ్చినవారిలో ఒకరిద్దరిని మాత్రమే లోనికి అనుమతించారు.బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని