logo

పేరుకే సంఘాలు.. ప్రభుత్వ సాయం శూన్యం

గొర్రెల పెంపకదారుల సంఘాలు పేరుకే..ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహక పథకాలు, సాయం శూన్యమని జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 30 Mar 2023 02:23 IST

మాట్లాడుతున్న ప్రకాష్‌యాదవ్‌

చిత్తూరు(వ్యవసాయం): గొర్రెల పెంపకదారుల సంఘాలు పేరుకే..ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహక పథకాలు, సాయం శూన్యమని జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక జిల్లా గొర్రెల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం సమావేశం బుధవారం నిర్వహించారు. పలువురు సభ్యులు మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో అమలు కానున్న నేషనల్‌ లైవ్‌స్టాక్‌ మిషన్‌ (ఎల్‌ఎన్‌ఎం) పథకాన్ని గొర్రెల పెంపకందారులు ఉపయోగించుకోవాలని రాష్ట్ర గొర్రెల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ప్రకాష్‌యాదవ్‌ పేర్కొన్నారు. ఎన్‌సీడీసీ రుణాలను సకాలంలో చెల్లించని 14 మంది సభ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గొర్రెల అభివృద్ధి సంస్థ ఏడీ రజని, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని