logo

రొయ్యల కాలువకు మోక్షమేది?

రొయ్యల కాలువ దుస్థితికి చేరడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చిట్టమూరు మండలంలోని 18 గ్రామాల్లో ఇది విస్తరించింది. సమీప పొలాల రైతులు వరితోపాటు వేరుసెనగ, కూరగాయలు తదితర ఆరుతడి పంటలను సాగు చేస్తుంటారు. 

Published : 31 Mar 2023 02:32 IST

ఇసుక చేరి ప్రవాహానికి ఇబ్బందులు

చిట్టమూరు సమీపంలోని కాలువ

కోట, న్యూస్‌టుడే: రొయ్యల కాలువ దుస్థితికి చేరడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చిట్టమూరు మండలంలోని 18 గ్రామాల్లో ఇది విస్తరించింది. సమీప పొలాల రైతులు వరితోపాటు వేరుసెనగ, కూరగాయలు తదితర ఆరుతడి పంటలను సాగు చేస్తుంటారు. కాలువలో ఇసుక చేరి ఎత్తుపల్లాలతో ఉండటంతో సక్రమంగా నీటిపారుదల జరగడం లేదు. దీంతో ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు దశాబ్దాల కిందట వచ్చిన భారీ తుపాను కారణంగా రొయ్యల కాలువకు వరదలు వచ్చాయి. ఇసుక ఎక్కడికక్కడ మేటలు వేయగా అప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. పూడిక తొలగిస్తే కాలువ నిండుగా ప్రవహించి భూగర్భ జలాలకు ఇబ్బంది ఉండదని రైతులు చెబుతున్నారు. ఈ విషయమై జలవనరుల శాఖ అధికారులు స్పందిస్తూ ప్రతిపాదనలు ఉన్నాయని, నిధులు మంజూరు చేయాల్సి ఉందని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని