logo

తెదేపా జీడీనెల్లూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా డాక్టర్‌ థామస్‌

తెదేపా గంగాధరనెల్లూరు నియోజకవర్గ బాధ్యుడిగా కార్వేటినగరం మండలం అల్లాగుంట గ్రామానికి చెందిన డాక్టర్‌ థామస్‌ను నియమిస్తూ అధినేత చంద్రబాబు గురువారం ప్రకటించారు.

Published : 02 Jun 2023 02:19 IST

చంద్రబాబును సత్కరించి పుష్పగుచ్ఛం అందిస్తున్న థామస్‌

పెనుమూరు, న్యూస్‌టుడే: తెదేపా గంగాధరనెల్లూరు నియోజకవర్గ బాధ్యుడిగా కార్వేటినగరం మండలం అల్లాగుంట గ్రామానికి చెందిన డాక్టర్‌ థామస్‌ను నియమిస్తూ అధినేత చంద్రబాబు గురువారం ప్రకటించారు. ఈ విషయమై అమరావతిలో అధినేత చంద్రబాబు.. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, నియోజకవర్గంలోని ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. థామస్‌ ప్రస్తుతం చెన్నైలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. అధినేత మాట్లాడుతూ అందరు సమష్టిగా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, ఆశావహులు సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారం మాజీ మంత్రి అమరనాథరెడ్డి చూసుకుంటా రన్నారు. ఇన్‌ఛార్జిగా నియమితుడైన థామస్‌, తెలుగు మహిళ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ  అధ్యక్షురాలు కార్జాల అరుణ, తెలుగురైతు అధ్యక్షుడు నాగేశ్వరరాజు, ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు రుద్రయ్యనాయుడు, జయశంకర్‌నాయుడు, లోకనాథరెడ్డి, చంగల్రాయ యాదవ్‌, రాజేంద్రన్‌, స్వామిదాస్‌, సమన్వయకర్త చిట్టిబాబునాయుడు పాల్గొన్నారు.


త్వరలో చంద్రబాబు కుప్పం పర్యటన

కుప్పం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఈ నెల రెండో వారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ దఫా పర్యటనలో నాలుగు మండలాల్లోని ప్రజలు, పార్టీ శ్రేణులను ఆయన కలుసుకోనున్నారు. ఆయన పర్యటన షెడ్యూలును మండల స్థాయి పార్టీ సమావేశాల నిర్వహణ ద్వారా ఖరారు చేస్తామని నేతలు తెలిపారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని