logo

‘ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు’

ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దీనికి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పలువురు ఆ సంఘాల నాయకులు హెచ్చరించారు.

Published : 08 Dec 2022 03:58 IST

ఎస్టీయూ ఆధ్వర్యంలో ధర్నా

అమలాపురం కలెక్టరేట్‌: ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దీనికి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పలువురు ఆ సంఘాల నాయకులు హెచ్చరించారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథి ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లంకలపల్లి సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ అన్ని శాఖల ఉద్యోగులకు వేతనాలు ఇచ్చిన ప్రభుత్వం ఉపాధ్యాయులకు మాత్రం ఇప్పటికీ జమ చేయలేదన్నారు. దీనిని బట్టి చూస్తే ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయాలని ఉద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తునట్లు స్పష్టమవుతోందన్నారు.  జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్‌ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం ఏర్పడి మూడున్నర ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క డీఏ కూడా ఇవ్వక పోవడం శోచనీయమన్నారు.అనంతరం పీఆర్సీ బకాయిలు, పింఛను దారులకు రావాల్సిన రూ.1,850 కోట్లు వెంటనే చెల్లించాలని, తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్వో సత్తిబాబుకు  అందజేశారు. ఈ కార్యక్రమంలో పి.దొరబాబు, జి.వి.వి.సత్యనారాయణ, సుదర్శన చక్రవర్తి, పళ్లం రాజు, ఆచారి, తదితరులు పాల్గొన్నారు.ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు తెదేపా నాయకులు మద్దతు తెలిపారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులు వేతనాల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితిని ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కల్పించారని మాజీ ఎమ్మెల్యేలు ఆనందరావు, జగదీశ్వరి, గొల్లపల్లి సూర్యారావు, నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం, అనంత లక్ష్మి తదితరులు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని