logo

హోరాహోరీగా ఎడ్ల పందేల పోటీలు

మాచవరం రైతు సంఘం ఆధ్వర్యంలో రాయవరం మండలం మాచవరంలో ఆదివారం హోరాహోరీగా రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పాల్గొన్నారు.

Published : 30 Jan 2023 05:31 IST

విజేతకు బహుమతి అందిస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

రాయవరం, న్యూస్‌టుడే: మాచవరం రైతు సంఘం ఆధ్వర్యంలో రాయవరం మండలం మాచవరంలో ఆదివారం హోరాహోరీగా రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి పాల్గొన్నారు. మొత్తం 37 జతలు ఈ పోటీలో పాల్గొనగా సీనియర్‌ విభాగంలో డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా గుమ్మిలేరు ఎడ్లు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచి బహుమతులు సాధించాయి. జూనియర్‌ విభాగంలో ఆర్బీకొత్తూరు, సామర్లకోట ప్రధమ,ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు.

విజేతలు వీరే: 1.6 కి.మీ. సీనియర్‌ విభాగం, 1 కి.మీ. జూనియర్‌ విభాగంగా పోటీలు నిర్వహించారు. సీనియర్‌ విభాగంలో కోరా వీరవెంకట సత్యవేణి (గుమ్మిలేరు) ప్రథమ స్థానం, కోరా తేజచౌదరి(గుమ్మిలేరు), ముత్యాల శ్రీధర్‌ రాయవరం మండలం (చెల్లూరు) తృతీయ స్థానంలో నిలిచారు.

జూనియర్‌ విభాగంలో: మన్యం సత్యనారాయణ (ఆర్‌బి కొత్తూరు) ప్రథమ బహుమతి, వల్లూరి సత్యేంద్ర కుమార్‌ (సామర్లకోట) ద్వితీయ బహుమతి, వల్లూరి సత్యేంద్రకుమార్‌ (సామర్లకోట) తృతీయ బహుమతి, గాడాపు ప్రేరణ (పెద్దాపురం) 4వ బహుమతి, మొగలి ఏసుబాబు(వెల్దుర్తి) 5వ బహుమతి, నాగార్జున మెమోరియల్‌ ఈశాంత్‌కుమార్‌ (చావలపాడు) 6వ బహుమతి గెలుచుకున్నారు. విజేతలకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బహుమతులు, అందజేశారు. కార్యక్రమంలో సర్పంచి కత్తుల సీతామహాలక్ష్మి, ఉపసర్పంచి పడాల వసంత్‌కుమార్‌రెడ్డి, ఎంపీటీసీ పలివెల శోభన సతీష్‌, పోటీల నిర్వాహకుడు వైకాపా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్తి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని