logo

పదేళ్లకోసారి ఆధార్‌ నవీకరణ తప్పనిసరి

పదేళ్లకోసారి ఆధార్‌ కార్డులను నవీకరించుకోవాల్సి ఉంటుందని జిల్లాస్థాయి ఆధార్‌ పర్యవేక్షణ కమిటీ(డీఎల్‌ఏఎంసీ) స్పష్టం చేసింది. చేతిముద్రలు, ఐరిస్‌తోపాటు ఆధార్‌లోని వివరాలు, పేర్లు, ఇంటి చిరునామా మార్పులుంటే సరిచేయించుకోవాలని సూచించింది.

Updated : 03 Feb 2023 06:41 IST

గోడప్రతులను ఆవిష్కరిస్తున్న అధికారులు

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): పదేళ్లకోసారి ఆధార్‌ కార్డులను నవీకరించుకోవాల్సి ఉంటుందని జిల్లాస్థాయి ఆధార్‌ పర్యవేక్షణ కమిటీ(డీఎల్‌ఏఎంసీ) స్పష్టం చేసింది. చేతిముద్రలు, ఐరిస్‌తోపాటు ఆధార్‌లోని వివరాలు, పేర్లు, ఇంటి చిరునామా మార్పులుంటే సరిచేయించుకోవాలని సూచించింది. డీఎల్‌ఏఏంసీ జిల్లాస్థాయి తొలి సమావేశం గురువారం కలెక్టర్‌ ఛాంబర్‌లో జరిగింది. కమిటీ ఛైర్‌పర్సన్‌, జిల్లా కలెక్టర్‌ మాధవీలత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆధార్‌ నవీకరణకు సంబంధించిన అంశాలపై సభ్యులు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆధార్‌ నవీకరణ ఆవశ్యకతపై డివిజన్‌, మండలస్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రచార గోడపత్రికలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. మార్చి 31 వరకు ఎటువంటి రుసుం లేకుండా ఉచితంగా ఆధార్‌ నవీకరణ ప్రక్రియ కోసం జిల్లావ్యాప్తంగా ఉన్న 246 ఆధార్‌ నమోదు కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తారు. 2006 నుంచి 2010 సంవత్సరాల మధ్య ఆధార్‌ కార్డు పొందిన వారు సమీపంలోని ఆధార్‌ కేంద్రానికి నవీకరణ చేయించుకోవాలి.  డీఎల్‌ఏసీఎం సమావేశంలో డీఆర్వో నరసింహులు, ఆర్డీవోలు చైత్రవర్షిణి, మల్లిబాబు, అదనపు ఎస్పీ కె.పాపారావు, యూఐడీఏఐ అసిస్టెంట్‌ మేనేజర్‌ వరప్రసాద్‌(హైదరాబాద్‌),  తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని