logo

అక్షరాస్యతతోనే మహిళా సాధికారత

అక్షరాస్యతతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, ప్రధానంగా వారిలో డిజిటల్‌ అక్షరాస్యత, సైబర్‌ సెక్యూరిటీపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని జేఎన్‌టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్‌ ప్రసాదరాజు అన్నారు.

Published : 05 Feb 2023 05:44 IST

యాప్‌ వివరాలు వెల్లడిస్తున్న వీసీ ప్రసాదరాజు, రిజిస్ట్రార్‌, రెక్టార్‌ తదితరులు

వెంకట్‌నగర్‌, న్యూస్‌టుడే: అక్షరాస్యతతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, ప్రధానంగా వారిలో డిజిటల్‌ అక్షరాస్యత, సైబర్‌ సెక్యూరిటీపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని జేఎన్‌టీయూకే ఉపకులపతి ఆచార్య జీవీఆర్‌ ప్రసాదరాజు అన్నారు. శనివారం వీసీ సమావేశ మందిరంలో ‘ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌, గ్రీవెన్సెస్‌ డైరెక్టరేట్‌, డిజిటల్‌ మానిటరింగ్‌ సెల్‌’ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్‌ సెక్యూరిటీపై ‘కౌంటరింగ్‌ సైబర్‌ అటాక్‌, సైబర్‌ ఫ్రాడ్స్‌ ఆన్‌ ఉమెన్‌’ అంశంపై అనుబంధ కళాశాలల మహిళా అధ్యాపకులు, విద్యార్థులకు వర్చువల్‌ విధానంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రతకు వర్సిటీ అధిక ప్రాధాన్యమిస్తుందన్నారు. అనంతరం వరల్డ్‌ ఆఫ్‌ ఉమెన్‌ సంస్థ రూపొందించిన యాప్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కేవీ రమణ, రిజిస్ట్రార్‌ ఆచార్య ఎల్‌.సుమలత, యూసీఈకే ప్రిన్సిపల్‌ ఆచార్య ఎం.హెచ్‌.ఎం.కృష్ణప్రసాద్‌, మహిళా సాధికారత విభాగం డైరెక్టర్‌ ఆచార్య ఎం.స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని