logo

కిక్కిరిసిన రత్నగిరి

అన్నవరం సత్యదేవుని సన్నిధి భక్తులతో కిక్కిరిసింది. మాఘపౌర్ణమి సందర్భంగా స్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.

Published : 06 Feb 2023 05:11 IST

వ్రతమాచరిస్తున్న భక్తులు

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవుని సన్నిధి భక్తులతో కిక్కిరిసింది. మాఘపౌర్ణమి సందర్భంగా స్వామి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వ్రతాలు ప్రారంభించారు. 4 గంటల నుంచి సర్వదర్శనాలకు అనుమతించారు. మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగింది. వ్రత మండపాలు, క్యూలైన్లలో భక్తులు బారులుదీరారు. రూ.1,500 రుసుముతో ప్రవేశించిన భక్తులకు వ్రతమండపం చాలక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈవో ఎన్వీ సత్యనారాయణమూర్తి పర్యవేక్షించి అధికారులకు సూచనలు చేశారు. ఉదయం 10 గంటలకు నిత్యకల్యాణం ప్రారంభమైంది. 10 గంటల నుంచే భక్తులకు నిత్యాన్నదానంలో భోజనం అందించారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. వ్రతాలు, కల్యాణాలు, పూజలు, ప్రసాద విక్రయం ద్వారా గణనీయంగా ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.

స్వామి దర్శనానికి బారులు..  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని