బస్సులో సీటిచ్చి నగలు కాజేశాడు..
బస్సులో కూర్చోటానికి ఓ మహిళలకు సీటిచ్చి, ఆమె సంచిలోని బంగారు నగలను దొంగిలించాడో వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి బిక్కవోలు వైపు వస్తున్న బస్సులో సోమవారం ఈ సంఘటన జరిగింది.
బిక్కవోలు: బస్సులో కూర్చోటానికి ఓ మహిళలకు సీటిచ్చి, ఆమె సంచిలోని బంగారు నగలను దొంగిలించాడో వ్యక్తి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి బిక్కవోలు వైపు వస్తున్న బస్సులో సోమవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా పేరేచర్లకు చెందిన చల్లా రేణుక సత్యదుర్గా మహాలక్ష్మి, అమె భర్త మురళీకృష్ణ బిక్కవోలు సుబ్రహ్మణ్యస్వామి దేవాలయానికి వస్తూ, అనపర్తిలో రైలుదిగి బస్సెక్కారు. బస్సు రద్దీగా ఉండటంతో కూర్చోటానికి జాగా లేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తి ఆమెకు సీటిచ్చి కూర్చోమన్నాడు. దీంతో ఆమె చేతిలోని బ్యాగ్ అతనికి ఇచ్చి.. తను కూర్చున్న తర్వాత బ్యాగు తీసుకుంది. ఆ తరువాత చూస్తే ఆ బ్యాగులోని బంగారు ఆభరణాలు లేవు. మంగళసూత్రం, గొలుసు, నల్లపూసలు, మూడు ఉంగరాలు చోరీకి గురయ్యాయని గుర్తించారు. ఆమెకు సీటిచ్చిన వ్యక్తి కనిపించలేదు. బంగారం విలువ ప్రస్తుతం రూ.2 లక్షలకు పైనే ఉంటుందని అంచనా. ఆ దంపతులు బిక్కవోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై బుజ్జిబాబు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
42 ఏళ్ల వయసులో అదృశ్యమై... 33 ఏళ్ల తర్వాత ఇంటికి!
-
Ts-top-news News
సిద్దిపేట శివారులో.. త్రీడీ ప్రింటింగ్ ఆలయం
-
India News
‘స్క్విడ్ గేమ్’ పోటీలో విజేతగా భారతీయుడు
-
Politics News
పార్టీని విలీనం చేయను.. పొత్తులు పెట్టుకోను
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/2023)
-
Sports News
కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం