logo

వైకాపా ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్‌ బ్యాచ్‌తో సంబంధం

రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్‌ బ్యాచ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆరోపించారు.

Updated : 28 Mar 2024 05:10 IST

రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరోపణ

వైకాపా ప్రజాప్రతినిధితో ఉన్న నరేష్‌కుమార్‌జైన్‌ (వృత్తంలో) చిత్రాన్ని చూపిస్తున్న ఆదిరెడ్డి వాసు

టి.నగర్‌, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరంలో అధికార వైకాపాకి చెందిన ఓ ప్రజాప్రతినిధికి స్మగ్లింగ్‌ బ్యాచ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, నగర ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆరోపించారు. బుధవారం రాజమహేంద్రవరం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గతేడాది దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులకు రూ.2 కోట్ల విలువైన బంగారంతో పట్టుబడిన నరేష్‌కుమార్‌ జైన్‌తో స్థానిక ప్రజాప్రతినిధికి సంబంధాలు ఉన్నాయంటూ ఇందుకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించారు. గత నవంబర్‌ 4న కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్న బంగారం గురించి వాకబు చేస్తే మహారాష్ట్రకు చెందిన గౌతమ్‌కుమార్‌, ఏపీˆకి చెందిన నరేష్‌కుమార్‌ జైన్‌ ముద్దాయిలుగా తేల్చారని పేర్కొన్నారు. ఈ సంఘటనను అప్పట్లో గోప్యంగా ఉంచారన్నారు. స్మగ్లింగ్‌ చేస్తూ అరెస్టయిన వ్యక్తులను పక్కన పెట్టుకొని తిరుగుతూ వైకాపా ప్రజాప్రతినిధి ఎన్నికల ప్రచారం చేస్తున్నారన్నారు. గతంలో ఎంపీ భరత్‌రామ్‌ నిర్వహించిన ఐశ్వర్య జ్యుయలర్స్‌ వ్యాపారాన్ని చూస్తుంటే.. ఇలాంటి స్మగ్లింగ్‌ సంబంధాలు ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందన్నారు. తప్పు చేసిన వాళ్లను పక్కన పెట్టుకుని తిరగడం చూస్తుంటే రాజమహేంద్రవరంపై ఆ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని