logo

లోపాన్ని సరిచేసిపింఛను ఇవ్వండి: లోకేశ్‌

మంగళగిరి నియోజకవర్గంలో తొలగించిన సామాజిక పింఛన్లను తిరిగి ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బుధవారం లేఖ రాశారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, వికలాంగులకు న్యాయమైన

Published : 09 Dec 2021 00:51 IST

చేనేత కార్మికునితో మాట్లాడుతున్న నారా లోకేశ్‌

మంగళగిరి, న్యూస్‌టుడే: మంగళగిరి నియోజకవర్గంలో తొలగించిన సామాజిక పింఛన్లను తిరిగి ఇవ్వాలంటూ జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ బుధవారం లేఖ రాశారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, వికలాంగులకు న్యాయమైన పద్ధతిలో పింఛన్లు అమలు చేయాలని కోరారు. కరోనాతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని గుర్తుచేశారు. మంగళగిరిలో పింఛను పొందలేకపోతున్న 12 మంది పేర్లతో ఒక జాబితాను ఆయన కలెక్టర్‌కు పంపారు. ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్ధి సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కలెక్టర్‌ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని