Published : 24 Jan 2022 15:18 IST
ఉపాధ్యాయుల పోరాటానికి వ్యతిరేకంగా వైకాపా నేతల ఆందోళన
సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం పెదమక్కెన జిల్లా పరిషత్ హైస్కూల్ ఎదుట వైకాపా నేతలు ధర్నా చేశారు. పీఆర్సీ కోసం ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటానికి వ్యతిరేకంగా స్థానిక వైకాపా నేతలు ఆందోళనలు నిర్వహించారు. ఉదయం 9 గంటలు దాటగానే పాఠశాల గేటుకు తాళాలు వేశారు.
సమయం దాటిన తర్వాత ముగ్గురు ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారు. దీంతో వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయానికి బడికి రాని టీచర్లు తమకు వద్దని.. వంద శాతం ఫలితాలు తీసుకురాలేని ఉపాధ్యాయులు అవసరం లేదంటూ నినాదాలు చేశారు. గ్రామాల్లోనే ఉండి చదువు చెప్పలేని టీచర్లకు ఎలాంటి సదుపాయాలు ఉండొద్దని డిమాండ్ చేశారు. అరగంట పాటు ఆందోళన చేసిన నేతలు.. ఆ తర్వాత గేటుకు తాళాలు తీసేసి వెళ్లిపోయారు. అనంతరం ఉపాధ్యాయులు విధులకు హాజరయ్యారు.
Tags :