logo

గ్రామాభివృద్ధిలో మొక్కల పెంపకం కీలకం

గ్రామాల అభివృద్ధికి మొక్కల పెంపకం కీలకమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ‘గ్రీన్‌ గొనసపూడి’ కార్యక్రమంలో భాగంగా యువ పారిశ్రామికవేత్త విక్రం నారాయణరావు, సర్పంచి విక్రం దీప్తి దంపతులు సమకూర్చిన పది వేల మొక్కలు

Published : 15 Aug 2022 06:39 IST

గొనసపూడిలో మొక్క నాటి, నీరు పోస్తున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ

చినగంజాం, న్యూస్‌టుడే: గ్రామాల అభివృద్ధికి మొక్కల పెంపకం కీలకమని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. ‘గ్రీన్‌ గొనసపూడి’ కార్యక్రమంలో భాగంగా యువ పారిశ్రామికవేత్త విక్రం నారాయణరావు, సర్పంచి విక్రం దీప్తి దంపతులు సమకూర్చిన పది వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఏలూరి ఆదివారం ప్రారంభించారు. పొలాల మధ్యలో గొనసపూడి, భీమవరం గ్రామానికి వెళ్లే గ్రావెల్‌ రోడ్డు వెంట ఎమ్మెల్యే ఏలూరి మొక్క నాటారు. కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నీరు పోశారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా గొనసపూడి గ్రామంలో 150 అడుగుల జాతీయ పతాకం ప్రదర్శించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పొద వీరయ్య, విక్రం వెంకట్రావు, బత్తుల శ్రీనివాసరావు, కొండ్రగుంట శ్రీహరిరావు, నాయుడు హనుమంతరావు, కందిమళ్ల చెంచుబాబు, పాలేటి రామకృష్ణ, పొద శేషగిరిరావు, దావులూరి రమేష్‌, దావులూరి రాము తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని