ఓడిన వైకల్యం.. నెరవేరిన కల
మాచర్లలోని ఓల్డ్ కోర్టు రహదారిలో ఇరుకు సందు.. అందులో ఓ చిన్న రేకుల ఇంట్లో అద్దెకు ఉండే ఓ పేద విద్యార్థి.. పోలియో కారణంగా అంగవైకల్యంతో అందరి పిల్లల్లా పరుగులు పెట్టలేని పరిస్థితి..
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే
మాచర్లలోని ఓల్డ్ కోర్టు రహదారిలో ఇరుకు సందు.. అందులో ఓ చిన్న రేకుల ఇంట్లో అద్దెకు ఉండే ఓ పేద విద్యార్థి.. పోలియో కారణంగా అంగవైకల్యంతో అందరి పిల్లల్లా పరుగులు పెట్టలేని పరిస్థితి.. రెండేళ్ల వయసులోనే తండ్రి మరణం.. తల్లి దినసరి కూలీగా పని చేస్తేనే ఇల్లు గడిచే పరిస్థితి.. ఆ కష్టాలన్నీ అతడి సంకల్పం ముందు చిన్నబోయాయి.. కష్టాలను విజయానికి మెట్లుగా మార్చుకుని ప్రతిష్ఠాత్మకమైన గుంటూరు వైద్య కళాశాలలో మొదటి ప్రయత్నంలోనే ఎంబీబీఎస్ సీటు సాధించాడు.. ఎందరికో స్ఫూర్తిగొలిపే విజయం సాధించిన ఆ విద్యార్థి షేక్ హమీద్. అతన్ని ‘న్యూస్‌టుడే’ పలుకరించగా తాను సాధించిన విజయం గురించి వివరించారు. ఆ విశేషాలు హమీద్ మాటల్లోనే..
చిన్నప్పుడే నాన్న మౌలాలీ చనిపోయారు. అమ్మ హుస్సేన్‌బీ దినసరి కూలీగా పని చేస్తూ వచ్చే ఆదాయమే మా ఇంటికి ఆధారం. పోలియో కారణంగా పుట్టుకతోనే నాకు వైకల్యం సోకింది. మాచర్లలోనే 1-5వ తరగతి వరకు విద్య ప్రాథమిక పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు జిల్లా పరిషత్ పాఠశాలలో తెలుగు మాధ్యమంలోనే చదివా. 10వ తరగతి చదువుతున్న సమయంలో ఎంబీబీఎస్ చదవాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నా. కానీ కళ్ల ముందు కుటుంబ కష్టాలు కనిపించాయి. త్వరగా కుటుంబానికి సాయపడాలనుకుని పాలిటెక్నిక్‌లో డిప్లొమా కోర్సులో చేరా. నా లక్ష్యం ఇది కాదని తెలిసింది. అక్కడ ఉండలేకపోయా. నాకు మాదిరిగానే వైకల్యంతో బాధపడుతున్నవారికి సేవ చేయాలంటే వైద్య వృత్తి సరైనదిగా భావించా. దీంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ గ్రూపు ఆంగ్ల మాధ్యమంలో చేరా. 900 మార్కులతో ఉత్తీర్ణత సాధించా. నీట్ శిక్షణకు చేతిలో పైసా లేదు. దీంతో చరవాణి సాయంతో అంతర్జాలంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని సేకరించి పరీక్షకు సిద్ధమయ్యా. తొలి ప్రయత్నంలోనే గుంటూరు వైద్య కళాశాలలో సీటు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది.
పెద్ద చదువు ఎందుకన్నారు
జూనియర్ కళాశాలలో చేరే సమయంలో కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కొంతమంది ‘ఎంబీబీఎస్’ అంటే పెద్ద చదువులే.. కష్టం అన్నారు. అయినా వెనకడుగు వేయలేదు. ఓ సారి ప్రయత్నిద్దామనుకున్నా. ఇంట్లో అమ్మ, అక్క అడ్డు చెప్పలేదు. మొదటి ప్రయత్నంలోనే నీట్ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాననే నమ్మకం ఉంది. కానీ ఇలా గుంటూరు వైద్య కళాశాలలో సీటు వస్తుందనుకోలేదు. ఇష్టంగా చదివాను కాబట్టే గెలిచాను.
అమ్మ కష్టమే చదువుపై ప్రేమ పెంచింది
పేదరికాన్ని మా చదువుకు ఎన్నడూ అడ్డు కానివ్వలేదు మా అమ్మ హుస్సేన్‌బీ. చిన్నప్పటి నుంచి నేను, మా అక్క హజియా బాగా చదువుతుండటం చూసి వారికి అర్థిక ఇబ్బందులను అడ్డు కాకుండా కూలి పని చేస్తూ కష్టపడుతూ చదివించింది. అక్క నరసరావుపేట జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. అమ్మ కష్టమే నన్ను ఇలా చదివేలా చేసింది. అదే ఇప్పటి నా విజయవానికి కారణం.
ప్రభుత్వ సాయం
‘వైద్య కళాశాలలో చేరాలంటే ఫీజు చెల్లించలేని పరిస్థితి. వసతి గృహంలో ప్రవేశానికి, మెస్ ఛార్జీలు చెల్లింపునకూ ఆర్థిక కష్టాలే. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ పద్మావతిదేవి ద్వారా తెలుసుకున్న జిల్లా పాలనాధికారి వేణుగోపాల్‌రెడ్డి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం చేసేలా చూశారు. ఎంబీబీఎస్ కోర్సు పూర్తయ్యే వరకూ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించనుంది. ఇక చదువు మీదే ధ్యాసంతా. ఎంబీబీఎస్ పూర్తి చేయాలన్నదే నా లక్ష్యం. పోలియోతో ఇలా అయ్యిందేమిటి? ఈ జీవితం అంతే? అనుకుంటే చేసేదేం లేదని అర్థం చేసుకున్నాను. అది నా సంకల్పాన్ని ఏమీ చేయలేకపోయింది. ఎన్నో అవరోధాలు ఉన్నాయని అనుకోకూడదు. నిత్యం చేదు జ్ఞాపకాల చిరునామాగా సాగకూడదనుకున్నా. లక్ష్యం నిర్దేశించుకుని కష్టపడి చదివితే విజయం మన సొంతమవుతుంది’.. అని నమ్ముతా అంటాడు హమీద్.
హమీద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
YSRCP: వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: వైకాపా ఎమ్మెల్యే సుధాకర్
-
Politics News
Andhra News: నీతో మాట్లాడను, వెళ్లవమ్మా.. వెళ్లు!: మహిళపై వైకాపా ఎమ్మెల్యే అసహనం
-
Ap-top-news News
AP Govt: రాజధాని కేసులను త్వరగా విచారించండి: సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ
-
World News
Bill Gates: వంటవాడిగా బిల్‌గేట్స్.. రోటీ తయారీ!
-
Ap-top-news News
Andhra News: వలస కూలీగా సర్పంచి
-
World News
Chinese Billionaires: చలో సింగపూర్.. తరలి వెళుతున్న చైనా కుబేరులు!