logo

అట్రాసిటీ కేసులో 8మంది అరెస్టు

మండలంలో పెదలంక పరిధిలోని కృష్ణానదిలో ‘నదీపరిరక్షణ శాఖకు’ చెందిన భూముల ఆక్రమణ, అడ్డగింత నేపథ్యంలో ఘర్షణలు జరిగి గడిచిన నాలుగు రోజులుగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Updated : 05 Feb 2023 05:24 IST

భూఆక్రమణ నిందితుడికి రిమాండ్‌

కొల్లూరు, న్యూస్‌టుడే: మండలంలో పెదలంక పరిధిలోని కృష్ణానదిలో ‘నదీపరిరక్షణ శాఖకు’ చెందిన భూముల ఆక్రమణ, అడ్డగింత నేపథ్యంలో ఘర్షణలు జరిగి గడిచిన నాలుగు రోజులుగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాము సాగు చేసేందుకు వెళుతుండగా కొందరు దాడి చేసి కొట్టారని చింతల్లంకకు చెందిన దళితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొంటూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇసుక మేటల ఆక్రమణ ఆరోపణలతో 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పలు నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితులుగా నమోదు చేసిన 9 మందిలో ఎనిమిది మందిని, నదీ పరిరక్షణశాఖ పరిధిలో ఉన్న భూముల్లోకి అక్రమంగా ప్రవేశించి ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారని సంబంధిత శాఖాధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 15మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు దీనికి కారకుడిగా గుర్తించి కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్‌ను అరెస్టు చేశారు. వీరందరినీ తెనాలి కోర్టులో న్యాయమూర్తి ఎదుట శనివారం హాజరుపరిచారు. నదీపరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిన తోడేటి సురేష్‌కు న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. ఆక్రమణను ప్రతిఘటించే ప్రయత్నంలో దళితులపై దాడి చేసిన ఘటనలో నిందితులు 8మందికి న్యాయమూర్తి బెయిల్‌ మంజూరు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని