logo

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు చర్యలు

జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి ఆదేశించారు.

Published : 21 Mar 2023 05:58 IST

సమీక్ష చేస్తున్న కలెక్టర్‌ శివశంకర్‌, హాజరైన వివిధ శాఖల అధికారులు

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన గ్రామోదయం కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు మండలాల్లో పర్యటిస్తే మరిన్ని సమస్యల పరిష్కారానికి అవకాశం ఉందన్నారు. అభివృద్ధి పనుల్లో వెనుకబడిన 10 మండలాల్లో తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్‌ వివరించారు. ఆయుష్మాన్‌భారత్‌, ఈకేవైసీ, పంచాయతీల్లో చెత్త నుంచి సంపద, జిల్లాలో బాలికలకు పౌష్టికాహారం అందజేత, రక్తహీనత సమస్యలు తదితర అంశాలపై సూచనలు చేశారు. హెచ్‌3ఎన్‌2 వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రారంభించనున్న రాగిజావ పంపణీని విజయవంతం చేయాలని తెలిపారు. కలెక్టరేట్‌లో తెలుగువారి తొలి పండగ ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో డీఆర్వో వినాయకం, జిల్లా అధికారులు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని