logo

చేతిరాతలో కొండవీడు విద్యార్థుల ప్రపంచ రికార్డు

కొండవీడు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు చేతిరాతలో ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నారు. ఆ పాఠశాల విద్యార్థులు ఇంటర్‌నేషనల్‌ వండర్‌ బుక్‌ రికార్డు ప్రతినిధుల సమక్షంలో సోమవారం ఆంగ్లంలో చేతిరాత ప్రతిభా ప్రదర్శన నిర్వహించారు

Published : 28 Mar 2023 06:17 IST

విద్యార్థుల చేతిరాత ప్రతిభా ప్రదర్శన పరిశీలిస్తున్న వండర్‌ బుక్‌ రికార్డు ప్రతినిధులు

యడ్లపాడు, న్యూస్‌టుడే: కొండవీడు ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు చేతిరాతలో ప్రపంచ రికార్డును కైవసం చేసుకున్నారు. ఆ పాఠశాల విద్యార్థులు ఇంటర్‌నేషనల్‌ వండర్‌ బుక్‌ రికార్డు ప్రతినిధుల సమక్షంలో సోమవారం ఆంగ్లంలో చేతిరాత ప్రతిభా ప్రదర్శన నిర్వహించారు. విద్యాలయంలోని 1-8 తరగతుల విద్యార్థులు 160 మందికి ఆంగ్లంలో కాలీగ్రఫీ, డబుల్‌ పెన్సిల్‌ కాలీగ్రఫీ శైలి, ఇన్నర్‌ డిజైన్‌ ఇన్‌ కలర్స్‌ విభాగాల్లో రెండుసార్లుగా చేతిరాత ప్రదర్శన చేశారు. విద్యార్థులు చక్కని చేతిరాతతో పాటు అందంగా డిజైన్లు, రంగులు అద్ది రెండు గంటల వ్యవధిలో చేయాల్సిన పనిని 1.26 గంటల వ్యవధిలో పూర్తి చేసి ప్రపంచ రికార్డును సాధించారు. దీంతో వీరికి వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటుదక్కింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోరంట్ల శ్రీనివాసరావు, కాలీగ్రఫీ శిక్షకుడు షేక్‌ జున్నూసాహెబ్‌, విద్యా వాలంటీర్‌ చాందినిలకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు సంస్థ ప్రతినిధులు ధ్రువీకరణ పత్రాలు, జ్ఞాపికలు, 2022 ఘనతల పుస్తకం అందజేశారు. ఇదే కార్యక్రమంలో వినుకొండకు చెందిన ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు పూసపాటి తేజ, షేక్‌ బీబీజాన్‌లు కాలీగ్రఫీలో పండ్లు, కూరగాయలపై విభిన్నంగా రాసి వండర్‌ బుక్‌ రికార్డు సొంతం చేసుకున్నారు. కార్యక్రమంలో వండర్‌ బుక్‌ రికార్డు ఇండియా ప్రతినిధి నరేంద్రగౌడ్‌, ఏపీ, తెలంగాణ ప్రతినిధి గంగాధర్‌, నరసరావుపేట లీమ్రా కోచింగ్‌ సెంటర్‌ ఛైర్మన్‌ షేక్‌ కరిముల్లా పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని